Rajayogam: మరో 10 రోజుల్లో ఈ 5 రాశుల వారికీ తిరుగులేని రాజయోగం.. అన్ని విషయాల్లో తగ్గేదేలే అంటూ దూసుకుపోవడమే..

Rajayogam: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయికల వల్ల కొన్ని గొప్ప రాజయోగాలు ఏర్పడతాయి. బుధుడిని గ్రహాల యువరాజుగా పిలుస్తారు. ఆయన జనవరి 2025 మొదటి వారంలో ధనుస్సు రాశిలోకి ప్రవేశిండం వలన ఈ ఐదు రాజయోగాలు ఏర్పడుతున్నాయి.

 

1 /7

Rajayogam: నవ గ్రహాల్లో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. దీని కారణంగా కొంత మంది రాశుల వారికీ  స్థానికులకు వృత్తి, వ్యాపారం, విద్య మొదలైనవి ప్రభావితం అయ్యే అవకాశాలున్నాయి. ధనుస్సు రాశిలో బుధుడు సంచారం వలన  ఏయే రాశుల వారికి మేలు జరుగబోతుందో చూద్దాం..

2 /7

సింహా రాశి.. బుధుడి ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం వలన సింహా రాశి వారికీ అనుకోని ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇండస్ట్రీలిస్టులు తమ మాటలతో ప్రజలను ఏమార్చగలరు. 2025 యేడాది ఆరంభంలో మంచి ఒప్పందం చేసుకుంటారు. జీవితంలో పురోగతిని సాధిస్తారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి.    

3 /7

కుంభ రాశి.. ధనుస్సు రాశిలోకి బుధ గ్రహ సంచారం వలన కష్టమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలో శుభకార్యలు జరుగుతాయి. డబ్బు పెట్టుబడుల మూలంగా లాభం పొందే అవకాశాలున్నాయి. వ్యాపారంలో రెట్టింపు లాభం అందుకుంటారు.

4 /7

మిథున రాశి.. మిథున రాశికి బుధుడి ధనుస్సు సంక్రమణం వల్ల కుటుంబ సంబంధాలు బలపడుతాయి. మీరు వ్యాపారంలో మంచి లాభాలను అందుకుంటారు. మీ కెరీర్ లో ప్రయోజనాలను అందుకుంటారు. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. అన్ని సమస్యలకు పరిష్కారాలు కనుక్కుంటారు.

5 /7

మీన రాశి.. బుధుడి ధనుస్సు రాశిలో సంచరించడం వలన మీన రాశి వారికి రాజయోగం ఏర్పడనుంది. ఉద్యోగంలో మార్పు రావచ్చు. వ్యాపారంలో అనేక లాభాలను పొందవచ్చు.  ధన ప్రవాహం అనూహ్యంగా పెరుగుతాయి. జీవిత భాగస్వామి నుండి అనుకోని మద్దతు లభిస్తుంది. కెరీర్‌లో ఉన్నత శిఖరాలు అందుకుంటారు.

6 /7

తులా రాశి.. బుధుడి ధనస్సు రాశిలో ప్రవేశించడం వలన తులా రాశికి అనుకోని లాభాలు కలనున్నాయి.  కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మనో ధైర్యం పెరుగుతుంది. ఆఫీసులో ఉన్నత పదవులు అందుకుంటారు.  కళ, నటన తదితర రంగాల్లోని వారికి  విజయం  వరిస్తుంది.  ప్రముఖ వ్యక్తులను కలవడంతో మీ జీవితం దశ, దిశా మారబోతుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. ఇది మంచి యోగ కాలం అని చెప్పాలి.

7 /7

గమనిక : ఇక్కడ మేము అందించిన సమాచారం ఇంటర్నెట్ తో పాటు  జ్యోతిషశాస్త్ర పండితులు చెప్పిన అభిప్రాయాలను మాత్రమే మేము ఇచ్చాము. దీన్ని ZEE 24 గంటలు నిర్ధారించడం లేదు.