Ram Charan: సినిమా రికార్డ్స్ తోనే కాదు.. కట్నంతో కూడా రికార్డ్ సృష్టించిన రామ్ చరణ్.. ఎన్ని కోట్లంటే..?

Ram Charan Legacy: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు.. తెచ్చుకున్న రామ్ చరణ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన నటనతో భారీ పాపులారిటీ.. అందుకున్నారు. ముఖ్యంగా ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ లాంటి దిగ్గజాలు కూడా రామ్ చరణ్ లో ఉండే టాలెంట్ మీకు ఎవరికి తెలియదు అంటూ కితాబు ఇచ్చారంటే.. ఆయన ఎంత ప్రతిభావంతులు అర్థం చేసుకోవచ్చు.  ఈ క్రమంలో రామ్ చరణ్ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఒక వార్త తెగ వైరల్ అవుతుంది..

1 /5

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా..ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ కొత్తలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. తండ్రి కారణంగానే సినిమా హిట్ అయిందని విమర్శించారు. ఆ తర్వాత తనను తాను ప్రూవ్ చేసుకున్నారు.. రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయారు.   

2 /5

ఇక రెండేళ్ల క్రితం వచ్చిన ఆర్ఆర్ఆర్.. సినిమాతో ఏకంగా ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకున్న రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ప్రముఖ డైరెక్టర్ దర్శకత్వంలో.. గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కాబోతోంది.  

3 /5

ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ కి సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. రామ్ చరణ్ సినిమా రికార్డ్స్ తోనే కాదు కట్నం విషయంలో కూడా రికార్డు సృష్టించారని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్ అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాపరెడ్డి మనవరాలైన ఉపాసన కామినేని వివాహం చేసుకున్నాడు. 2012లో వీరు వివాహం చాలా ఘనంగా జరిగింది. 

4 /5

ఇక పోతే ఈ జంటకు సంబంధించిన ఒక విషయం వైరల్ గా మారుతుంది. అదే కట్నం. రామ్ చరణ్ టాలీవుడ్ లో ఉండే హీరోల అందరి కంటే ఎక్కువ కట్నం తీసుకొని రికార్డు సృష్టించారు. 2012లో ఉపాసనను వివాహం చేసుకున్నప్పుడు ఆమె నుంచి రూ.120 కోట్లు కట్నం కింద తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు చార్టెడ్ ఫ్లైట్.. కూడా అత్తవారు రామ్ చరణ్ కు బహుమతిగా అందించారట.  

5 /5

ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు వీరి పెళ్లి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక బెంచ్ మార్క్.. క్రియేట్ చేసింది. అంత అత్యంత ఘనంగా వీరి వివాహం జరిపించారు.