Ram Charan: ఈ తరంలో తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరో చెప్పేసిన రామ్ చరణ్

Ram Charan news: రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎంతటి గుర్తింపు తెచ్చుకున్నారు.. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా తర్వాత సోలో హీరోగా.. రామ్ చరణ్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా.. జనవరి 10న తెలుగులోనే కాకుండా.. ఇతర భాషలు అన్నిటిలో కూడా విడుదలవుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో తెగే యక్టివ్ గా పాల్గొంటున్నారు ఈ హీరో. కాగా ఈ మధ్యనే రామ్ చరణ్ ఈ తరం హీరోయిన్స్ లో తన ఫేవరెట్ ఎవరని.. చెప్పి అందరిని ఆకట్టుకున్నాడు.  

1 /5

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రామ్ చరణ్ తన తాజా సినిమా గేమ్ ఛేంజర్ విడుదలకు సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసే అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో పాల్గొన్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ కార్యక్రమంలో బాలకృష్ణ తన దృష్టి బెస్ట్ యాక్ట్రెస్‌ ఎవరు అని అడగగా…రామ్ చరణ్ వెంటనే ఒక హీరోయిన్ పేరు చెప్పేశారట. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. అందరినీ మాయ చేసిన సమంత.    

2 /5

చరణ్ మాట్లాడుతూ.. సమంత తనతో కలిసి నటించిన సినిమా రంగస్థలంలో.. అద్భుతమైన నటనను ప్రదర్శించారని తెలిపారంట. రామ్ చరణ్ ఇందులో చిట్టిబాబు పాత్రను పోషించగా, సమంత సుబ్బలక్ష్మి పాత్రలో కనిపించారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో.. పెద్ద విజయాన్ని సాధించి, వారి జంట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.  

3 /5

కాగా రామ్ చరణ్ బాలీవుడ్ హీరోయిన్స్ తో సైతం నటించిన సంగతి తెలిసిందే. ఆలియా భట్, కియారా అద్వాణీలతో కూడా రామ్ చరణ్ నటించారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ లో చరణ్-ఆలియా జంటగా కనిపించగా, కియారాతో ఆయన వినయ విధేయ రామ చిత్రంలో నటించారు.  

4 /5

తాజాగా, గేమ్ ఛేంజర్ చిత్రంలో కియారాతో మళ్లీ కలిసి పనిచేశారు.  అలా హిందీ హీరోయిన్స్ ని కూడా పక్కన పెట్టి మన తెలుగు హీరోయిన్ సమంత పేరు గ్లోబల్ స్టార్ చెప్పారు అని తెలియడంతో.. ఆమె అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.    

5 /5

గేమ్ ఛేంజర్ సినిమా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇందులో రామ్ చరణ్ ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు. రాజకీయ అవినీతిని ఎదుర్కొనే.. క్రమంలో ఓ రాజకీయనాయకుడితో ఆయన ఘర్షణ ఈ సినిమాలో చూపించబోతున్నారు దర్శకుడు శంకర్. ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం.