Ram Charan: అనంత్ అంబానీ పెళ్లిలో రామ్ చరణ్, ఉపాసనలకు అరుదైన గౌరవం.. పిక్స్ వైరల్..

Ram Charan: ఆకాశం అంతా పందిరి.. భూదేవి అంత అరుగు అన్నట్టు కనీవినీ ఎరగని రీతిలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లో వివాహాం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లిలో తెలుగు రాష్ట్రాల  నుంచి రామ్ చరణ్, మహేష్ బాబు సహా పవన్ కళ్యాణ్, చంద్రబాబు సహా సినీ, రాజకీయ  ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా రామ చరణ్, ఉపాసనలు.. అనంత్ అంబానీ పెళ్లిలో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

1 /5

తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి అంబానీ పెళ్లికి ముందుగా ఆహ్వానం అందుకున్న హీరో రామ్ చరణ్ అనే చెప్పాలి. ఆ తర్వాత మహేష్ బాబు కూడా ఆహ్వానం అందినా.. గతంలో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుక సహా అన్ని ఈవెంట్స్ కు హాజరైంది రామ్ చరణ్ దంపతులనే చెప్పాలి.  

2 /5

ఇక ఈ పెళ్లిలో రామ్ చరణ్.. ఉపాసనలు కొత్త దంపతులైన అనంత్, రాధిక మర్చంట్ లతో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

3 /5

అంతేకాదు అనంత్ అంబానీ.. రామ్ చరణ్ చేతిలో చేయి వేసి అప్యాయతతో పలకరిస్తూన్న ఫోటో చూసి గ్లోబల్ స్టార్ కు అంబానీ ఎంత ప్రాముఖ్యత ఇస్తారనే విషయం స్పష్టమైంది.

4 /5

అంతేకాదు అనంత్, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలో దిగిన ఫోటోలో అనంత్ వాళ్ల నాన్న ముఖేష్ అంబానీ కూడా రామ్ చరణ్ దంపతులను ఆప్యాయంగా పలకరించారు.

5 /5

రామ్ చరణ్ విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా ఈ యేడాది చివర్లో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.