YS Jagan INDI Alliance: జాతీయ రాజకీయాల్లో వైఎస్‌ జగన్‌ సంచలనం.. ఇండియా కూటమిలోకి ఎంట్రీ?

YS Jagan YSRCP Entering In INDI Allaince With Jantar Mantar Dharna: ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనలో తమ పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం రేపారు. ఇండియా కూటమితో కలిసి జగన్‌ కనిపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

1 /9

YS Jagan With INDI Alliance: ఏపీలో జరుగుతున్న దారుణాలకు నిరసనగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి ధర్నా చేశారు.

2 /9

YS Jagan With INDI Alliance: రాష్ట్రంలో హత్యా రాజకీయాలతో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దమనకాండపై ఢిల్లీలో వైఎస్సార్ సీపీ నిరసన చేపట్టింది.

3 /9

YS Jagan With INDI Alliance: శాంతి భద్రతలు గతి తప్పాయని ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీ ధర్నాలో మాజీ సీఎం జగన్‌ డిమాండ్ చేశారు.

4 /9

YS Jagan With INDI Alliance: ఇన్నాళ్లు ఎన్డీయేకు పరోక్ష మద్దతు పలుకుతూ జాతీయ రాజకీయాలు నడిపిన జగన్‌ ఇప్పుడు ఇండియా కూటమితో కలిసి పనిచేయడం విశేషం.

5 /9

YS Jagan With INDI Alliance: జగన్‌ ధర్నాకు ఇండియా కూటమిలోని ఉద్దవ్‌ శివసేన, అన్నాడీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు మద్దతు పలికాయి.

6 /9

YS Jagan With INDI Alliance: ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో జగన్‌ ధర్నాకు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ హాజరై మద్దతు ప్రకటించారు.

7 /9

YS Jagan With INDI Alliance: ఈ నిరసనకు ఉద్ధవ్ శివసేన ఎంపీలు ప్రియాంక చతుర్వేది, సంజయ్‌రౌత్‌ మద్దతు తెలిపారు.

8 /9

YS Jagan With INDI Alliance: ఈ ధర్నాకు తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే ఎంపీ తంబి దొరై మద్దతు ప్రకటించారు. జగన్‌ ధర్నాలో పాల్గొని మద్దతు ఇచ్చారు.  

9 /9

YS Jagan With INDI Alliance: వైఎస్సార్‌సీపీ చేపట్టిన ధర్నాకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్ హక్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ వాహబ్ తదితరులు హాజరయ్యారు.