Realme P1 Speed ​​5G: రూ.20 వేల Realme P1 మొబైల్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.8 వేలే.. ఈ లక్కీ ఛాన్స్‌ మీ కోసమే..

Black Friday Sale Mobile Discount Offers: realme P1 స్పీడ్ 5G స్మార్ట్ ఫోన్లు అత్యంత తగ్గింపు ధరకే పొందాలనుకునే వారికి బ్లాక్ ఫ్రైడే సేల్ (Black Friday Sale) అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఈ సేల్‌లో భాగంగా అత్యంత తగ్గింపు ధరకే ఈ మొబైల్ ను పొందవచ్చు. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

Black Friday Sale Mobile Discount Offers: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రస్తుతం బ్లాక్ ఫ్రైడే సేల్ (Black Friday Sale) నడుస్తోంది. ఈ సెల్ లో భాగంగా అన్ని రకాల వస్తువులు అత్యంత తగ్గింపు ధరకే లభిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేసే వారికి అదనంగా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేసే వారికి ఇది పెద్ద పండగ అని చెప్పవచ్చు. ఈ సేల్‌లో భాగంగా సగం ధరలకే కొన్ని మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. 

1 /5

ప్రస్తుతం బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్స్‌లో realme P1 స్పీడ్ 5G ఒకటి. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు హై స్పీడ్ ఫైవ్ జి టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ మొబైల్ భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది.   

2 /5

ప్రస్తుతం ఈ  realme P1 మొబైల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ సేల్ లోని 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర MRP రూ.20,999 కాగా.. బ్లాక్ ఫ్రైడే సెల్లో భాగంగా 14 శాతం డిస్కౌంట్‌తో లభిస్తుంది.   

3 /5

ఇక ఈ మొబైల్ పై ఉన్న ఫ్లాట్ డిస్కౌంట్ పోనూ కేవలం రూ.17,999కే ఈ realme P1 స్పీడ్ 5G స్మార్ట్ ఫోన్ పొందవచ్చు. ఇక అదనంగా ఈ మొబైల్ పై బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి వివరాల్లోకి వెళితే.. దీనిని కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి బిల్ చెల్లిస్తే, రూ.3,000 పాటు డిస్కౌంట్ లభిస్తుంది.   

4 /5

అలాగే ఈ realme P1 మొబైల్ పై బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా ఎస్బిఐ బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డ్, హెచ్డిఎఫ్సి బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి కూడా పేమెంట్ చేసి రూ.3,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ అన్నీ పోను రూ.14,999కే ఈ మొబైల్ పొందవచ్చు. 

5 /5

ఈ realme P1 స్మార్ట్ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్‌లో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్‌ను ఎక్స్చేంజ్ చేసి ఏకంగా రూ.6,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు. దీంతో ఆఫర్స్ అన్నీ పోను రూ.8,000 వేలకే కొత్త ఫోన్ పొందవచ్చు.