Prabhas Top Movies: రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో టాప్ మూవీస్ ఇవే..


Prabhas Top Movies:  కటౌట్  చూసి నమ్మేయాలి డూడ్ అని ప్రభాస్ ను చూస్తే నిజమే అనిపిస్తోంది. ఈ పేరు వెంటే ఆరడుగుల ఆజానుబాహుడు కళ్ల ముందు కదలుతాడు. తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఏక్ నిరంజన్ లా దూసుకుపోతున్న మిస్టర్ పర్ ఫెక్ట్ ఈ బాహుబలి. అంతేకాదు టాలీవుడ్ టూ బాలీవుడ్ శాసిస్తున్న సినీ ఛత్రపతి.  మాస్ ప్రేక్షకులకు రెబల్. క్లాస్ ఆడియన్స్ కు డార్లింగ్. ఈ నెల 23న ప్రభాస్ కెరీర్ బర్త్ డే సందర్భంగా ఆయన సినీ కెరీర్ లో టాప్ మూవీస్ విషయానికొస్తే..

1 /10

ప్రభాస్ తన 22 యేళ్ల కెరీర్ లో దాదాపు 20కి పైగా చిత్రాల్లో నటించారు. అంతేకాదు అందులోదాదాపు సగానికి పైగా సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అంతేకాదు బాహుబలి సిరీస్ తో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

2 /10

వర్షం.. శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వర్షం’ సినిమాతో హీరోగా ప్రభాస్ తొలి సక్సెస్ అందుకున్నాడు. అప్పటి నుంచి హీరోగా వెనుదిరిగి చూసుకోలేదు.

3 /10

ఛత్రపతి.. రాజమౌళి దర్శకత్వంలో తొలిసారి ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘ఛత్రపతి’. ఈ సినిమా రెబల్ స్టార్ కెరీర్ లో మరో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది.

4 /10

డార్లింగ్.. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో ప్రభాస్ కు రెబల్ ఇమేజ్ నుంచి డార్లింగ్ ఇమేజ్ వచ్చింది.

5 /10

మిస్టర్ పర్ఫెక్ట్.. దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ పర్ఫెక్ట్’. ఈ చిత్రం ప్రభాస్  కెరీర్ లో మరో డిఫరెంట్ మూవీగా నిలిచింది.

6 /10

మిర్చి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిర్చి’. ఈ సినిమాతో ప్రభాస్ తొలిసారి రూ. 40 కోట్ల క్లబ్బులో చేరాడు.

7 /10

బాహుబలి 1: రాజమౌళితో చేసిన బాహుబలి 1 సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్‌ అయ్యాడు. తెలుగులో రూ. 100 కోట్ల షేర్ అందుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే.  ఈ రేంజ్ లో అన్ని భాషల్లో హిట్టైన చిత్రం ఇదే నేమూ.  ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను ఈజీగా క్రాస్ చేసింది. 

8 /10

బాహుబలి 2: రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా  యాక్ట్ చేసిన చిత్రం 'బాహుబలి 2'. ఈ సినిమా తెలుగులోనే కాదు భారతీయ చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.    

9 /10

సలార్: ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో  రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు బాహుబలి తర్వాత ప్రభాస్ ఈ చిత్రంతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. 

10 /10

కల్కి 2898 AD నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ ను అందించింది. ఈ సినిమాలో ప్రభాస్... కర్ణుడిగా.. భైరవుడిగా రెండు పాత్రల్లో మెప్పించాడు.