రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన రోబో 2.0 సినిమా స్టిల్స్

Nov 3, 2018, 05:07 PM IST
1/9

4డీ సౌండ్ టెక్నాలజీతో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు ఈ టెక్నాలజీతో ఏ ఇండియన్ సినిమా కూడా విడుదల కాలేదు.

2/9

ఈ చిత్రంలో సహాయక పాత్రలలో సుధాంశు పాండే, అదిల్ హుస్సేన్, కళాభవన్ షాజోన్, రియాజ్ ఖాన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ (ప్రత్యేక పాత్రలో) నటించారు.

3/9

13 సెప్టెంబరు 2018 తేదిన విడుదలైన 2.0 చిత్ర టీజర్‌కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే రిలీజైన ట్రైలర్ కూడా ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. 

4/9

2.0 చిత్రం నవంబరు 29, 2018 తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. భారతదేశంలో ఇప్పటివరకు విడుదలైన చిత్రాలన్నింటి కన్నా ఖరీదైన చిత్రంగా ఈ సినిమాని పేర్కొనవచ్చు. 

5/9

అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో.. అక్షయ్ కుమార్ ప్రతినాయకుని పాత్ర పోషిస్తున్నారు. 

6/9

2.0 చిత్రం తమిళంతో పాటు 13 భాషల్లో అనువాదమవుతోంది. 

7/9

ఏ.ఆర్.రెహ్మాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే ఆంటోనీ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. 

8/9

లైకా ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులను ధర్మా ప్రొడక్షన్స్ కైవసం చేసుకుంది. 

9/9

రూ.530 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 2.0 చిత్రాన్ని శంకర్ చాలా ప్రతిష్టాత్మకమైన రీతిలో తెరకెక్కించారు.