Running Tips: ఖాళీ కడుపుతో రన్నింగ్‌ చేస్తున్నారా? ఇవి తప్పకుండా తెలుసుకోండి!

Running Tips: ప్రస్తుతం చాలామంది ఉదయం పూట ఖాళీ కడుపుతో వాకింగ్ చేస్తున్నారు. నిజానికి ఇలా చేయడం మంచిదేనా? ఇలా చేయడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా జరుగుతాయా? ఇంతకీ నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి.

 

Running Tips In Telugu: ప్రతిరోజు రన్నింగ్ చేయడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఉదయం పూట 5 నుంచి 6 గంటల మధ్యలో వాకింగ్ చేయడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడకుండా ఉంటారు. అయితే చాలామంది ఉదయాన్నే నీటిని తాగకుండా మరీ కాళీ కడుపుతో వాకింగ్ చేస్తున్నారు. నిజానికి ఇలా ఖాళీ కడుపుతో వాకింగ్ చేయడం మంచిదేనా? 
 

1 /6

అలాగే చాలామంది ఖాళీ కడుపుతో రన్నింగ్ కూడా చేస్తూ ఉంటారు. నిజానికి వైద్యులు ఏం చెబుతున్నారంటే ఖాళీ కడుపుతో ప్రతిరోజు ఉదయం పూట రన్నింగ్ చేయడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయట. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఇలా చేయడం మరింత మంచిదని వారంటున్నారు.   

2 /6

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించుకోవడానికి ప్రతిరోజు టిఫిన్ తిన్న తర్వాత వాకింగ్ చేయడం కంటే, ఖాళీ కడుపుతో వాకింగ్ లేదా రన్నింగ్ చేయడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని క్యాలరీస్ సులభంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.   

3 /6

ప్రస్తుతం చాలామందిలో మొండి కొవ్వు కారణంగా బరువు పెరుగుతున్నారు. అయితే దీనిని నియంత్రించుకోవడానికి కాళీ కడుపుతో చేసి రన్నింగ్ ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట.   

4 /6

అధ్యయనాల ప్రకారం ఖాళీ కడుపుతో ప్రతిరోజు వ్యాయామం, రన్నింగ్ చేయడం వల్ల ఇన్సులిన్ ప్రక్రియ మెరుగుపడుతుందట. దీని కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

5 /6

అలాగే మధుమేహంతో బాధపడుతున్న వారు కూడా ఇలా ఖాళీ కడుపుతో ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల ఎంతో మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. 

6 /6

ప్రతిరోజు ఖాళీ కడుపుతో రన్నింగ్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. తరచుగా ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతిరోజు ఖాళీ కడుపుతో తప్పకుండా వాకింగ్ చేయాల్సి ఉంటుంది.