Sai Pallavi in White Saree: సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందంతోనే కాకుండా అభినయంతో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఈ హీరోయిన్. మిగతా హీరోయిన్స్ అందరూ తమ ఫ్యాషన్ దుస్తులతో ఆకట్టుకుంటూ ఉంటే.. సాయి పల్లవి సింపుల్గా చీర కట్టుకొని ఇన్స్టాగ్రామ్ వారిని ఫిదా చేస్తోంది.
సాయి పల్లవి అంటే ఎంతగానో అభిమానించేవారు.. సౌత్ ఇండియాలో చాలామందే ఉన్నారు. ఎందుకు ముఖ్య కారణం.. ఆమె ప్రవర్తనా పేరు అలాగే ఆమె ఎంచుకునే సినిమాలు. ముఖ్యంగా సాయిపల్లవి సినిమా చేస్తోంది అంటే.. ఆ సినిమాలో తప్పకుండా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అని ప్రేక్షకులు నమ్మేదా చేసుకుంది ఈ హీరోయిన్.
సాయి పల్లవి చేసే ప్రతి సినిమాలో ఆమె క్యారెక్టర్ ఎంతో హైలెట్గా నిలుస్తుంది. తెలుగులో సాయి పల్లవి మొదటిగా.. నటించిన ఫిదా చిత్రం దగ్గర నుంచి…మొన్న విడుదల మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న అమరన్ వరకు ఇదే ఫాలో అయ్యింది ఈ హీరోయిన్.
సినిమాల్లోనే కాదు బయట కూడా ఈ హీరోయిన్ ఎంతో హుందాగా కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. మిగతా హీరోయిన్స్ గోవాలో ఎంజాయ్ చేస్తే.. అభిమాన హీరోయిన్ మాత్రం దేవుడి సన్నిధిలో కనిపిస్తుంది అని ఈమె అభిమానులు ఎన్నోసార్లు కామెంట్లు పెట్టడం కూడా మనం చూస్తూ ఉంటాం.
ఇక ఇప్పుడు ఇదే ఫాలో అవుతూ మరోసారి సాయి పల్లవి షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తెల్ల చీర కట్టుకొని ఎంతో అందంగా.. చందమామలా కనిపిస్తూ ఆమె అభిమానులను మరోసారి ఫిదా చేసింది సాయి పల్లవి.
కొన్ని ఫోటోలలో తన అమ్మమ్మను దేవుడి దగ్గర ఆశీస్సుల కోసం తీసుకుపోతూ.. ఎంతో ముచ్చటగా కనిపించింది. మొత్తం పైన ఈ ఫోటోలు అన్నీ ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతూ మరోసారి సాయి పల్లవిని మెచ్చుకునేలా చేస్తున్నాయి.