Samantha: అక్టోబర్ సమంతకు శాపంగా మారనుందా.. ఇదెక్కడి విడ్డూరం బాసూ..?

Samantha Curse: సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక మంచి సెంటిమెంట్ , ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తమ సినిమాల విషయంలో అయినా లేదా వ్యక్తిగత విషయంలో అయినా సరే ఇలాంటి సెంటిమెంట్స్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అవుతున్న సమంతకి కూడా అక్టోబర్ శాపంగా మారనుంది అంటూ కొన్ని ఉదాహరణలు సైతం బయటకు చెబుతూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

1 /5

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఏ మాయ చేసావే సినిమా ద్వారా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ హృదయాలను సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత చాలామంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. అయితే ఏమైందో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో అటు సోషల్ మీడియాలో ఇటు ఇండస్ట్రీలో తనకు సంబంధం లేని వివాదాలతో హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే.

2 /5

ముఖ్యంగా తన భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటుంది.  విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఈ విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయనటంలో సందేహం లేదు. ముఖ్యంగా సమంత ,నాగచైతన్య విడిపోయినప్పుడు విడాకుల గల కారణాలను వీరిద్దరూ వివరించలేదు. దీంతో చాలా మంది సమంతపై విమర్శలు గుప్పించారు.

3 /5

దీనికి తోడు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా సమంత పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆమెను వార్తల్లోకి లాగేసింది. అలా ఎప్పటికప్పుడు సమంత వార్తల్లో నిలుస్తున్న నేపథ్యంలో అసలు సమంతాకు అక్టోబర్ దురదృష్టంగా మారింది అంటూ సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

4 /5

ముఖ్యంగా అక్టోబర్ నెల ఈమెకు అసలు కలిసి రావడం లేదు అంటూ చెబుతుండడం గమనార్హం. దాదాపు 7 ఏళ్లపాటు ప్రేమించిన నాగచైతన్యను అక్టోబర్ 6 2017 లో వివాహం చేసుకుంది. అయితే ఆ తర్వాత ఈమె వైవాహిక బంధం సక్సెస్ కాలేదు. ఇకపోతే 2021 అక్టోబర్ రెండవ తేదీన వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు అక్టోబర్లోనే కొండా సురేఖ సమంత పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటినీ బట్టి  చూస్తే అక్టోబర్ సమంత కు శాపంగా మారింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

5 /5

ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే.. హనీ బన్నీ వెబ్ సిరీస్ తో త్వరలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది .మరొకవైపు నిర్మాతగా మారి మా ఇంటి బంగారం అనే సినిమా కూడా నిర్మిస్తోంది ఈ ముద్దుగుమ్మ.