Samantha: హీరోయిన్ సమంత గురించి కొత్తగా ఎలాంటి పరిచయాలు అక్కర్లేదు. గత ఒకటిన్నర దశాబ్దాంగా టాలీవుడ్ అగ్ర కథానాయికగా రాణిస్తోంది సామ్. ఆ మధ్య మయాసిటీస్‌తో బాధపడిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి కథానాయికగా బ్యాక్ బౌన్స్ అయింది. అంతేకాదు ఎన్నడు లేనట్టుగా క్లీవేజ్ షోతో రచ్చ చేస్తోంది.
Samantha:సమంత (Samantha Ruth Prabhu) కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.ఆమె 15 యేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది. నాగ చైతన్య హీరోగా నటించిన 'ఏమాయా చేసావే' మూవీతో కథానాయికగా అడుగుపెట్టిన సామ.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఈ మూవీలో జెస్సీ పాత్రలో సామ్ నటనను ఎవరు మరిచిపోలేదు.
14 యేళ్ల కెరీర్‌లో ఎన్నో డిఫరెంట్ చిత్రాలతో అలరించింది. అందులో గుణ శేఖర్ దర్శకత్వంలో చేసిన 'శాకుంతలం' వంటి పౌరాణిక సినిమా కూడా కూడా ఉంది. అటు లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటించి మెప్పించింది.
సమంత.. ఆ మధ్య మయాసిటీస్ అనే వింత వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయాన్ని అభిమానులతో ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేది సమంత ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. వెబ్ సిరీస్‌లలో యాక్ట్ చేస్తోంది. ఇక 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో ఈమె ఎల్టీటీఈ ఉగ్రవాది పాత్రలో జీవించింది.
మరోవైపు వరుణ్ ధావన్‌తో కలిసి రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూట్ కంప్లీట్ చేసింది. త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీస్‌కు హనీ బన్ని అనే టైటిల్ పెట్టారు.
ఈ సంగతి పక్కన పెడితే.. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉన్న సమంత.. మాయాసిటీస్ నుంచి కోలుకోవడానికి కొన్ని రోజులు షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంది.
సమంత.. పర్సనల్ విషయానికొస్తే.. ఆ మధ్య హీరో అక్కినేని నాగ చైతన్యతో ఈమె వివాహాం గ్రాండ్‌గా జరిగింది. ఆ తర్వాత వీరిమధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.
ప్రస్తుతం సమంత, నాగ చైతన్య ఎవరి జీవితాలను వారు లీడ్ చేస్తున్నారు. ఎవరి సినిమాలు వాళ్లు చేస్తున్నారు. అంతేకాదు ఇద్దరు వెబ్ సిరీస్‌లలో దూసుకుపోతున్నారు.