Add Zee Business As A Preferred Source
App

Samantha: సింగిల్ గా ఉండను.. రెండో పెళ్లి చేసుకోను.. సమంత బోల్డ్ కామెంట్స్..

Written ByTA Kiran Kumar
Published: Nov 03, 2024, 09:47 PM IST|Updated: Nov 03, 2024, 09:47 PM IST

Samantha: సమంత గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఈమె కెరీర్ కొత్త పుంతలు తొక్కుతోంది. అంతేకాదు తెలుగు సినీ ఇండస్ట్రీలో గత 15 యేళ్లుగా  టాప్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే కదా. త్వరలో ‘సిటాటెల్’ వెబ్ సిరీస్ తో పలకరించబోతుంది.  ఈ నేపథ్యంలో రెండో పెళ్లితో పాటు సింగిల్ గా ఉండటంపై బోల్డ్ కామెంట్స్ చేసింది.

Samantha Bold Comments 1/6

సమంత బోల్డ్ కామెంట్స్

Samantha : సమంత నాగ చైతన్యతో విడాకుల తర్వాత కెరీర్ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్యాన్ ఇండియా హీరోయిన్ సత్తా చాటుతోంది. ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో పలకరించిన సామ్.. త్వరలో ‘సిటాడెల్ ..హనీ బన్ని’ వెబ్ సిరీస్ తో పలకరించబోతుంది.

 

Samantha Web Series 2/6

సమంత వెబ్ సిరీస్

ఈ వెబ్ సిరీస్ ప్రచారంలో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ సందర్భంగా ‘పుష్ప’సినిమాలో మాదిరిగా ఇకపై సినిమాల్లో మళ్లీ స్పెషల్ సాంగ్స్ చేస్తారా అనే ప్రశ్నకు లేదు అని సమాధానం చెప్పింది.

Samantha Single 3/6

సమంత సింగిల్

అంతేకాదు సింగిల్ గా ఉండాలనుకుంటున్నారా.. అనే ప్రశ్నకు లేదు.. కానీ పెళ్లి చేసుకోను అంటోంది. అయితే.. సామ్ .. సింగిల్ గా ఉండను అనే సమాధానంలో ఎన్నో ప్రశ్నలు ప్రేక్షకుల మదిలో మెదులుతున్నాయి.

Pan India Heroine 4/6

ప్యాన్ ఇండియా హీరోయిన్

ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచి ప్యాన్ ఇండియా హీరోయిన్ గా సమంత సత్తా చాటుతోంది. సామ్.. తన మాజీ భర్త నాగ చైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏమాయ చేసావే’ సినిమాతో పరిచయమైంది.

15 Years Of Span 5/6

15 యేళ్ల కెరీర్

15 స్పాన్ ఆఫ్ కెరీర్ లో శాకుంతలం అనే పౌరాణిక సినిమాతో పాటు వెబ్ సిరీస్ లతో విభిన్న పాత్రల్లో అలరించింది. ప్రస్తుతం తెలుగులో లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో నటిస్తూ సత్తా చాటిన సంగతి తెలిసిందే కదా.

Samantha Assets 6/6

సమంత ఆస్తులు

  సమంత.. ఆ మధ్య మయాసిటీస్ అనే వింత రోగంతో బాధపడిన సంగతి తెలిసిందే కదా. దాన్ని నుంచి కోలుకుంది.  సమంత మాజీ భర్త నాగ చైతన్య.. త్వరలో శోభితా ధూళిపాలను పెళ్లి చేసుకోబోతుంది. సమంత తన రెమ్యునరేషన్ ను పలు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. నాగ చైతన్యతో భరణంతో కలిపి  ప్రస్తుతం ఈమె ఆస్తుల విలువ దాదాపు రూ. 250 కోట్ల నుంచి  రూ. 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా.