Sania Mirza Ready To Second Marriage What Is Fact: భారతదేశానికి క్రీడాపరంగా ఎన్నో పతకాలు అందించిన మాజీ టెన్నీస్ క్రీడాకారిణి సానీయా మీర్జా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒంటరిగా మారింది. షోయబ్ మాలిక్‌తో విడాకుల అనంతరం ఆమె రెండో పెళ్లికి సిద్ధమైనట్లు పుకార్లు వస్తున్నాయి. ఓ బాలీవుడ్ ప్రముఖ నటుడితో ఆమె డేటింగ్లో ఉన్నారని.. అతడిని వివాహం చేసుకుంటారనే వార్తలు బయటకు వచ్చాయి.
Sania Mirza: విడాకుల తర్వాత బాలీవుడ్ హీరోతో సానియా మీర్జా రెండో పెళ్లి?
విడాకులు: భారత టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అతడు రెండో పెళ్లి చేసుకోగా సానియా మాత్రం ఇజాన్ మాలిక్‌తో ఉంటోంది.
రెండో వివాహం: షోయబ్ మాలిక్ పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకుని హాయిగా ఉండగా.. అతడి మాదిరి సానియా కూడా రెండో వివాహం చేసుకుంటుందనే పుకార్లు వస్తున్నాయి.
ఆ నటుడితో: బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌తో గతంలోనే సానియా ప్రేమ వ్యవహారం నడిపిందనే కథనాలు ఉన్నాయి. వీరి బంధం గురించి వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.
నాడు ఖండన: కాఫీ విత్ కరణ్‌కి వచ్చిన సానియా మీర్జా 'ఆ వార్త కేవలం పుకారు మాత్రమే' అని కొట్టిపారేసింది. షాహిద్‌తో తనకు ఎప్పుడూ సంబంధం లేదని చెప్పేసింది.
మళ్లీ అనుబంధం: సానియా మీర్జా, షాహిద్ కపూర్ డేటింగ్ చేస్తున్నట్లు కొన్ని మీడియాలో చర్చ జరిగింది. అయితే అప్పట్లోనే షాహీద్ కపూర్‌తో ప్రేమాయణం నడపగా మరోసారి అతడితో సంబంధం కొనసాగిస్తోందని పుకార్లు వస్తున్నాయి.
ముంబైలో నివాసం: షాహీద్ కపూర్‌తో సానియా మళ్లీ ప్రేమ చిగురించిందని.. ప్రస్తుతం ముంబైలో సానియా ఉంటోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి ఆధారం లేదు.
పుకార్లేనా?: ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలన్నీ పుకార్లని.. అవి నిజం కాదని సానియా సన్నిహితులు కొట్టివేసినట్లు సమాచారం