Keerthy Suresh: పింక్ డ్రెస్‌లో హాట్ అండ్ బ్యూటీఫుల్‌గా కీర్తి సురేష్... ఫిదా అవుతున్న నెటిజన్లు

'సర్కారు వారి పాట' సినిమాతో మరో హిట్‌ తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. మహేష్ బాబు-కీర్తి సురేష్ జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. కీర్తి తన లేటెస్ట్ ఫోటోషూట్‌ను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
  • May 15, 2022, 15:28 PM IST

Keerthy Suresh Latest Photoshoot: 'సర్కారు వారి పాట' సినిమాతో మరో హిట్‌ తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. మహేష్ బాబు-కీర్తి సురేష్ జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. కీర్తి తన లేటెస్ట్ ఫోటోషూట్‌ను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

1 /5

పింక్ కలర్ 'స్లిట్ కట్' డ్రెస్‌లో ఫోటోలకు పోజులిచ్చిన కీర్తి సురేష్... కీర్తిని పింక్‌లో చూశాక.. ఇంకెవరినీ ఆ డ్రెస్‌లో చూడబుద్ది కాదని... ఆ కలర్ ఆమెకు బాగా సూట్ అయిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 

2 /5

పింక్ డ్రెస్‌లో కీర్తి హాట్ అండ్ బ్యూటీఫుల్‌గా ఉందంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. కీర్తిని మించి అందమైన హీరోయిన్ మరెవరూ సినీ ఇండస్ట్రీలో లేరని ఓ నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం. 

3 /5

కీర్తి చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. 2016లో వచ్చిన నేను శైలజ చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

4 /5

కీర్తి సురేష్ తక్కువ వ్యవధిలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'మహానటి' కీర్తి సురేష్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. 

5 /5

సర్కారు వారి పాటతో బ్లాక్ బ్లస్టర్ కొట్టిన కీర్తి సురేష్ ప్రస్తుతం చిరంజీవితో 'భోళా శంకర్', నానితో 'దసరా' మూవీలో నటిస్తోంది. ఇవిగాక తమిళం, మళయాలంలోనూ కొన్నిచిత్రాల్లో నటిస్తోంది. చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది.