Saturn Retrograde 2023: శని వక్రావస్థ ప్రభావంతో ఈ 5 రాశులకు అక్టోబర్ 15 వరకూ తిరుగుండదు

Saturn Retrograde 2023: జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. ప్రతి గ్రహానికి ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాల కదలిక అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంటుంది. ఈ క్రమంలో శని గ్రహం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

Saturn Retrograde 2023: శని గ్రహం ప్రస్తుతం వక్రావస్థలో ఉంది. అంటే తిరోగమన దశలో నడుస్తోంది. అక్టోబర్ 15 వరకూ ఇదే స్థితిలో ఉండనుంది. ఈ స్థితిలో ఉన్నా సరే శని గ్రహం కొన్ని రాశులకు అమితమైన లాభాల్ని అందించనుంది. ఆ రాశులేంటో పరిశీలిద్దాం..
 

1 /5

ధనస్సు రాశి శని వక్రావస్థ కారణంగా ధనస్సు రాశి జాతకులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి సరైన అవకాశాలు లభిస్తాయి. 

2 /5

తుల రాశి శని తిరోగమనం ప్రభావం తుల రాశి జాతకులకు అత్యంత అనుకూలంగా ఉండనుంది. ఈ సమయంలో ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. కెరీర్‌పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. కష్టపడినదానికి పూర్తి ప్రతిఫలం లభిస్తుంది.

3 /5

సింహ రాశి శని తిరోగమనం ప్రభావం సింహ రాశి జాతకుల వృద్ధికి దోహదపడుతుంది. కెరీర్ సంబంధిత విషయాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్థులకు విజయం లభిస్తుంది. ఊహించని ధనలాభం ఉంటుంది.

4 /5

మిధున రాశి శని వక్రావస్థ కారణంగా మిధున రాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. అక్టోబర్ 15 వరకూ అన్నింటా విజయం లభించవచ్చు. పెట్టుబడులకు మంచి సమయం. విదేశీ యాత్రలు చేయవచ్చు

5 /5

మేష రాశి మేష రాశి జాతకులకు శని వక్రావస్థ ప్రభావంతో ఊహించని లాభాలు కలగనున్నాయి. కొత్త పనులు ప్రారంభించేందుకు చాలా అనువైన సమయం. శని కటాక్షంతో ఈ రాశి జాతకుల కెరీర్‌లో ఉన్నత స్థానం చేరుకుంటారు. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది.