Saturn rise 2024: శని గ్రహం ప్రభావంతో ఈ 5 రాశులకు ఊహించని లాభాలు

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం కదలికకు మహత్యం, ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాల కదలిక ప్రబావం మొత్తం 12 రాశులపై ప్రతికూలంగాలేదా సానుకూలంగా ఉండవచ్చు. మార్చ్ 18న శని గ్రహం కుంభ రాశిలో ఉదయించనున్నాడు. దాంతో 5 రాశులకు ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. 

Saturn rise 2024: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం కదలికకు మహత్యం, ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాల కదలిక ప్రబావం మొత్తం 12 రాశులపై ప్రతికూలంగాలేదా సానుకూలంగా ఉండవచ్చు. మార్చ్ 18న శని గ్రహం కుంభ రాశిలో ఉదయించనున్నాడు. దాంతో 5 రాశులకు ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. 

1 /5

ధనస్సు రాశి కుంభ రాశిలో శని ఉదయించడం వల్ల ధనస్సు రాశి జాతకులకు ఊహించని లాభాలు కలుగుతాయి. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఉద్యోగస్థులకు పదోన్నతి లభిస్తుంది. 

2 /5

కన్యా రాశి కన్యా రాశి జాతకులకు శని ఉదయించడం మూలంగా ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే చాలా కష్టాలు దూరమౌతాయి. వ్యాపారస్థులకు అమితమైన లాభాలు కలుగుతాయి. జీతభత్యాలు పెరుగుతాయి.

3 /5

మిధున రాశి మిధున రాశి జాతకులకు శని ఉదయించడం వల్ల అత్యంత లాభదాయకం కానుంది. ఉద్యోగస్తులకు అంతా అనుకూలంగా ఉంటుంది. పదోన్నతులు లభిస్తాయి. ధనలాభం కలుగుతుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిని కలిగి ఉంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

4 /5

సింహ రాశి శని కుంభ రాశిలో ఉదయించడం వల్ల సింహ రాశి జాతకులకు అద్భుతమైన లాభాలు కలగనున్నాయి. ముఖ్యంగా ఊహించని ధనలాభం కలుగుతుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెండింగులో పడిన పనులు పూర్తవడం, నిలిచిపోయిన డబ్బులు తిరిగి రావడం జరుగుతుంది. 

5 /5

మేష రాశి మేష రాశి జాతకులకు శని కుంభరాశిలో ఉదయించడం ఫలితంగా ప్రత్యేకంగా ఉండనుంది. కుటుంబ సంబంధాలు పటిష్టంగా ఉంటాయి. తల్లిదండ్రుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. ఉద్యోగాల్లో పదోన్నతి లభించవచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. శని దేవుడి కటాక్షంతో ఇంట్లో సుఖ శాంతులు లభిస్తాయి.