School Holidays: భారీవర్షాల కారణంగా స్కూళ్లకు 2 రోజులు సెలవు.. విద్యాశాఖ కీలక ప్రకటన

School Holidays Ap:  రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల స్కూళ్లకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. ముఖ్యంగా నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఈరోజు సెలవు ప్రకటించింది. ఇక రేపు ఆదివారం కావడంతో స్కూళ్లకు రెండు రోజులపాటు సెలవు రానుంది.  
 

1 /5

ముఖ్యంగా విశాఖ, అనకాపల్లిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ స్కూళ్లకు ఈ సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ అధికారులు సర్క్యూలర్‌ జారీ చేశారు. అయితే, ఈరోజు కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో స్కూలు విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  

2 /5

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.  ఆంద్రప్రదేశ్‌లో కోస్తా తీరంలో గంటకు 45 నుంచి 65 కిలో మీటర్ల వేగంతో గాలులు కూడా వీయనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు కూడా వేటకు వెళ్లకూడదని వారిని అప్రమత్తం చేశారు.  

3 /5

ముఖ్యంగా అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, తిరుపతి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అకాశం ఉంది. దీంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు కూడా ఈరోజు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.  

4 /5

బంగాళఖాతం అల్పపీడనం వల్ల రానున్న 36 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అందుకే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను కూడా అప్రమత్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వ. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు వర్షాలు, వరదల నేపథ్యంలో గుజరాత్‌ కూడా అతలాకుతలమవుతుంది.   

5 /5

నేటి నుంచి  మరో మూడు రోజులపాటు కూడా తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో ఉమ్మడి కరింనగర్‌, వరంగల్‌, రంగా రెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు హైదరాబాద్‌లో కూడా పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి.