Shani Dev Vakri: మరో 6 నెలలు ఈ రాశుల వారిపై శని దేవుడి అశుభ దృష్టి.. ఈ పరిహారాలు పాటిస్తే అంతా శుభమే..

Shani Dev Vakri: నవగ్రహాల్లో శని దేవుడిని కర్మ ప్రధాతగా పిలుస్తుంటాము. ప్రస్తుతం శని దేవుడు కుంభ రాశిలో తిరోగమనంలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఈ మూడు రాశుల వారు వచ్చే మార్చి వరకు అప్రమత్తంగా ఉండాలి. అంతేకాదు ఈ ఆరు నెలలు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికొస్తే.

1 /8

Shani Dev Vakri: జ్యోతిష్య శాస్త్రంలో  శని దేవుడు న్యాయ దేవుడిగా పిలుస్తుంటారు. ఎవరి చేసే కర్మలను బట్టి వారికి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. శని దేవుడు ఒక రాశిలో రెండున్నరేళ్లపాటు ఉండి ఆ వ్యక్తికి చేసిన మంచి చెడులను  బట్టి ఫలితాలు ఇస్తుంటాడు. శని దేవుడు ప్రతి రాశిలో ఉండటం వలన కొన్ని రాశుల వారికి ఏల్నాటి శని  ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం వని వక్ర గమనంలో ఉండటం వలన ఈ మూడు రాశుల శారు అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

2 /8

కుంభరాశిలో శని సంచారం వలన 5 రాశుల వారు ఏల్నాటి శని ప్రభావంతో పాటు అష్టమ శని,అర్ధాష్టమ శని ఫలితాలను ఎదుర్కొంటున్నారు.   ప్రస్తుతం శని దేవుడు 3 రాశుల మీద  చెడు దృష్టిని కలిగి ఉన్నాడు.  దీంతో ఆయా రాశుల వారికీ ఆర్థిక నష్టం, అనవసరమైన వివాదాలు, చేసే పనిలో ఒత్తిడి వంటివి వారికి  అడ్డంకులుగా మారుతాయి.

3 /8

నవంబర్ 2024లో శని వక్రం నుంచి ప్రత్యక్షంగా కదలబోతున్నాడు.  శని మార్చి 2025లో మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడే ఈ వ్యక్తులు కొంత అప్పటి వరకు పడుతన్న బాధల నుంచి ఉపశమనం పొందుతారు. ఈ 3 రాశులు ఏమిటో తెలుసుకోండి.  

4 /8

మేష రాశి.. మేష రాశి వారు ఈ కాలంలో చాలా అప్రమత్తంగా మెలగాలి. లేకుంటే భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. శత్రువులు మీపై పై చేయి సాధించే అవకాశాలున్నాయి. అవసర ప్రయాణాలను రద్దు చేసుకోవడం ఉత్తమం. చేసే ప్రతి పనిలో అప్రమత్తత అవసరం. 

5 /8

కన్యా రాశి.. శని దేవుడు కన్యా రాశి వారిపై అశుభ  దృష్టిని కలిగి ఉంది. దీంతో ఈ సమయంలో ఈ రాశుల వారి  వ్యక్తుల జీవితాల్లో పెను మార్పులు సంభవించనున్నాయి. వ్యాపారస్తులు ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరి పెట్టుబడులు పెడితే మంచిది.  లేకపోతే ఆర్ధిక పరమైన ఇబ్బందులను ఫేస్  చేయవచ్చు.

6 /8

మకర రాశి.. మకర రాశి పై శని దేవుడు అశుభ దృష్టి ఉంది. త్వరలో వీళ్లు అనుభవిస్తున్న ఏల్నాటి శని మార్చి నాటికి తొలిగిపోతుంది. ఈ ఆరు నెలలు ఈ రాశుల వ్యక్తులు చేసే పనిలో శ్రద్ధ పెట్టాలి. ప్రతి పని మీకు చికాకు కలిగించవచ్చు. మీ కెరీర్ లో సవాళ్లను ఎదుర్కుంటారు. ఎవరితో అనవసరంగా మాట్లాడవద్దు.

7 /8

ఈ మూడు రాశుల వారు ప్రతి శనివారం .. నవగ్రహాలున్న ఆలయానికి వెళ్లి.. మూడు లేదా 9 ప్రదక్షిణలు చేయండి. నల్ల బట్ట, నల్ల నువ్వులు, నూనెతో శనికి తైలాభిషేకం చేయండి. శని వారం పేద వాళ్ల బట్టలు లేదా ఆహారం దానం ఇస్తే శని దేవుడు తీక్షణ దృష్టి మీపై తగ్గుతుంది.

8 /8

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, ఇంటర్నెట్, జ్యోతిష్యులు ప్రస్తావించిన అంశాలనే మేము ఇక్కడ సమాచారంగా ఇచ్చాము.  ZEE NEWS దీనిని ధృవీకరించడం లేదు.