Shilpa Shetty: స్టార్ హీరో నన్ను వాడుకుని వదిలేశాడు.. మరో హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Shilpa Shetty's sensational comment: లవ్ ఎఫైర్స్ చిత్రపరిశ్రమలో సర్వసాధారణం. సినిమా షూటింగ్ సమయంలో హీరో హీరోయిన్లు ప్రేమలో పడటం, కొన్నాళ్ల తర్వాత విడిపోవడం, కొంతమంది పెళ్లి చేసుకోవడం ఇలాంటవన్నీ చూస్తూనే ఉన్నాం. కానీ శిల్పాశెట్టి కథ కూడా ఇలాంటిదే అయినప్పటికీ కాస్త డిఫరెంట్. తాను ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిందట. కానీ ఆ హీరో మాత్రం అవసరం తీరాకా..మీరో హీరోయిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తనను మోసం చేశాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ పొడుగుకాళ్ల సుందరి. 
 

1 /8

Shilpa Shetty's sensational comment:  శిల్పాశెట్టి..బాలీవుడ్ లో స్టార్ డమ్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్. స్టార్ హీరోల సరసన సూపర్ హిట్ మూవీస్ లో నటిస్తూ తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది ఈ పొడుగుకాళ్ల సుందరి. ప్రస్తుతానికి ఈ బ్యూటీ వయస్సు 49ఏళ్లు. అయినప్పటికీ ఏమాత్రం తరగని అందం ఈ అమ్మడు సొంతం. అదిరిపోయే ఫిట్‌నెస్ లుక్ తో  కనిపిస్తూ నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటుంది.   

2 /8

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ..బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో జడ్జీగా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలోనూ  యాక్టివ్ గా ఉంటోంది. నిత్యం జిమ్ వర్కౌట్ వీడియోలు, లేటేస్ట్ క్రేజీ ఫొటోలను తన ఫ్యాన్స్ కోసం షేర్ చేస్తుంది.

3 /8

 అయితే శిల్పా శెట్టి తన పర్సనల్ లైఫ్ గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించింది. తాను స్టార్ హీరో తో ప్రేమలో పడ్డానని..ఆ స్టార్ హీరో తనను వాడుకుని వదిలేసి మరో హీరోయిన్ తో ప్రేమాయణం నడిపించాడంటూ సంచలన కామెంట్స్ చేసింది.   

4 /8

శిల్పాశెట్టి, అక్షయ్ కుమార్ ప్రేమ బాలీవుడ్ లో అందరికీ తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారన్న టాక్ కూడా వినిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరూ విడిపోయారు. అక్ష్ నిజస్వరూపం బయటపడటంతో శిల్పా తీవ్ర మనస్తాపానికి గురైందట. శిల్పా, అక్షయ్ ల ప్రేమ, విడిపోవడం గురించి శిల్పా చేసిన ఆరోపణలు చూద్దాం.   

5 /8

షారుక్ ఖాన్ తో నటించిన బాజీగర్ మూవీతో శిల్పాశెట్టి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.  ఆ తర్వాత అక్షయ్ కుమార్ తో మై ఖిలాడీ తు అనాడీ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా హిట్అయ్యింది. అంతేకాదు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి కూడా ఈ సినిమానే కారణం. ఆ సమయంలో అక్షయ్  కుమార్, రవీనా టాండన్ తో డేటింగ్ లో ఉన్నాడు. 

6 /8

1999లో ట్వింకిల్ ఖన్నాతో కలిసి ఇంటర్నేషనల్ ఖిలాడీ మూవీలో నటించాడు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం శిల్పాకు తెలిసింది. దీంతో ఆమె మనోవేధనకు గురయ్యింది. అక్షయ్ తో బంధం తెంచుకుంది. కొంత  కాలానికి అక్షయ్, ట్వింకిల్ ఖన్నా పెళ్లి చేసుకున్నారు. 

7 /8

కాగా 2000వ సంవత్సరంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శిల్పాశెట్టి, అక్షయ్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. శిల్పా కన్నీళ్లు కూడా పెట్టుకుంది. అక్షయ్ తనను మోసం చేసి వదిలేశాడని తెలిపింది. అక్షయ్ మోసం గురించి తెలిసిన వెంటనే అతనితో తన బంధాన్ని తెంచుకున్నట్లు తెలిపింది.

8 /8

 అంతేకాదు ప్రొఫెషనల్ గా కూడా తనతో కలిసి పనిచేయడం, నటించడం కూడా మానేసినట్లు  చెప్పింది.  అక్షయ్ నన్ను వాడుకుని..వేరే అమ్మాయి దొరికిన వెంటనే నన్ను వదిలేశాడు. చాలా కోపంగా ఉందని..కానీ చేసిన పాపానికి శిక్ష తప్పదని..ట్వింకిల్ ఖన్నాపై నాకు ఎలాంటి కోపం లేదని చెప్పుకొచ్చింది శిల్పాశెట్టి.