Shravana Masam 2024 Puja: శ్రావణ మాసంలో శుక్రవారాలు ఇలా చేస్తే మీకు అశేష ప్రయోజనాలు కలుగుతాయి. లక్ష్మి దేవి నిత్యపూజ చేస్తే ఆ ఇంట్లో దరిద్రం ఉండదు. ఆర్థిక సమస్యలు ఉన్న దంపతులు కలిసి చేసుకోవాలి. ఉదయం పూజ భార్యభర్తలు కలిసి చేసుకోవడం వల్ల ఎన్నో ఫలితాలు.
ఈ పూజ సాయంత్రం కూడా చేసుకోవచ్చు. ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇలా నాలుగు శుక్రవారాలు చేస్తే దరిద్రం తొలగిపోతుంది.
పీఠం వేసి బియ్యం పోయాలి. దానిపై బట్ట వేసుకుని కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో బియ్యం, రూపాయి బిళ్ల మామిడి ఆకులు వంటివి పెట్టి ఏర్పాటు చేసుకోవాలి. ఈ పూజకు కలశ ఆరాధన, గణపతి పూజ చేసిన తర్వాత షోడశోపచార పూజ చేయాలి. ఆ తర్వాత అంగ పూజ లక్ష్మి అష్టోత్తరాలు, కనక ధార స్తోత్రం చదవాలి. ఆ తర్వాత నైవేద్యాలు పెట్టాలి.
ముఖ్యంగా తొమ్మిది దారాలు తీసుకుని దానికి తొమ్మిది మూడులు వేసి వాటికి పూజలు చేయాలి. మీరు కుడి చేతికి కట్టించుకోవాలి. ఆ తర్వాత వ్రత కథ చదవాలి.
ఇది చారుమతి అనే మహిళ మొట్టమొదటిసారిగా చేసిన కథ ఇది ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. ఒకసారి ఈమెకు లక్ష్మిదేవి కలలో కనిపించి వరలక్ష్మి దేవి వ్రతం చేయమని కోరిందట. దీంతో ఆమె అందరినీ పిలిచి వ్రతం చేసుకుంటారు. ఆ తర్వాత అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తుంటే పట్టీలు, బంగారు గాజులు వంటివి వచ్చాయని చెబుతారు.
ఈ కథ తర్వాత వాయనం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, లక్ష్మీదేవికి కోపం తెప్పించే రెండు విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి అతిగా ఖర్చు పెట్టడం, రెండోది భార్యను నిందించడం, ఆమెను నిర్లక్ష్యంగా చూడటం.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)