Shruti Haasan: యమ స్టైలిష్ గా శృతిహాసన్.. బ్రేకప్ తర్వాత హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు..

Shruti Haasan Instagram Photos: శృతిహాసన్ ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ ఫోటోలతో అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి.
 

1 /5

అనగనగా ఒక ధీరుడు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శృతిహాసన్. కమల్ హాసన్ కూతురుగా ప్రేక్షకులకు పరిచయమైన ఆ తరువాత తన నటనతో.. మంచి పేరు తెచ్చుకుంది ఈ నటి.

2 /5

కాగా శృతిహాసన్ కెరియర్ మొదట్లో తెలుగులో అన్ని ఫ్లాప్స్ వచ్చాయి. దాంతో ఆమెని అప్పట్లో ఐరన్ లెగ్ అని కూడా అనేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ తో శృతిహాసన్ చేసిన గబ్బర్ సింగ్ సినిమా ఆమె కెరియర్ ని మార్చేసింది.  

3 /5

గబ్బర్ సింగ్ చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా శృతిహాసన్ కి ఎన్నో ఆఫర్లు తీసుకొచ్చింది. అప్పటినుంచి శృతిహాసన్ గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ఆ తరువాత వచ్చిన శృతిహాసన్ సినిమాలు అన్నీ కూడా దాదాపు.. మంచి విజయం సాధించినవే.

4 /5

తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ ఇండస్ట్రీలలో కూడా ఎన్నో సినిమాలలో నటించింది శృతిహాసన్. అంతేకాకుండా సింగర్ గా కూడా ఈ హీరోయిన్ కి మంచి పేరు ఉంది.  

5 /5

ఇక ప్రస్తుతం శృతిహాసన్ డెకాయిట్,  సలార్ 2 సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంది. ఈ క్రమంలో శృతిహాసన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.