Chandrababu naidu: దటీజ్ చంద్రబాబు.. మోదీ పక్కన చంద్రబాబు సీటు.. జీరో నుంచి హీరో వరకు తెలుగోడి సత్తా..

Ap assembly election results 2024: లోక్ సభ ఎన్నికలలో కూటమి నేతలకు ఏపీప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పవచ్చు. ఇక చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారారు.

1 /7

18 వ లోక్ సభ ఎన్నికలలో ప్రజలు వినూత్నంగా ఫలితాలు ఇచ్చారు.  మెయిన్ గా అన్ని ఎగ్జీట్ పోల్ సర్వేలు కేంద్రంలో బీజేపీ 370  కు పైగా సీట్లు సాధిస్తారని చెప్పారు. మోదీ కూడా తన చరిష్మాతో ఎన్నికలలో ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో ప్రచారం నిర్వహించారు. 

2 /7

ఇక మోదీ కొన్ని నిర్ణయాలు దేశంలో ఎంతో మంది ప్రజల మనస్సులు గెలుచుకున్నారు. రామమందిరం నిర్మాణం, ఆర్టికల్ 370, ట్రిబుల్ తలాఖ్ రద్దు, సీఏఏ పై కీలక నిర్ణయం వంటి నిర్ణయాల్లో మంచి స్పందన వచ్చింది. ఈసారి బీజేపీ చార్ సో పార్ సీట్లు గెలుస్తుందని అందరు భావించారు. 

3 /7

కానీ అనూహ్యంగా బీజేపీకి 240 స్థానాలు సాధించారు.  కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 272. ప్రభుత్వ ఏర్పాటుకు ఫుల్ మెజారీటీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మోదీ తన మిత్రపక్షాలపైన ఆధారపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటు చంద్రబాబు, అటు జేడీయూ లు కీలకంగా మారారని చెప్పుకొవచ్చు.  

4 /7

ఎన్నికలలో ప్రస్తుతం.. టీడీపీకి 16, జేడీయూకు 12 స్థానాల మద్దతు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు కీలకంగా మారాయి. ప్రధాని మోదీ, అమిత్ షాలు చంద్రబాబుకు ఫోన్ కాల్ చేసి ప్రత్యేకంగా  విషేస్ కూడా  చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే కన్వీనర్ పదికి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. 

5 /7

దేశ ప్రధాని మోదీ, టీడీపీ నేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లతో పాటు, తమ మిత్రపక్షాలతో సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా.. మోదీ పక్కనే చంద్రబాబు సీటును కేటాయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో అనేక పర్యాయాలు చంద్రబాబు, మోదీని కలవడానికి హస్తినకు వచ్చారు. 

6 /7

అనేక పర్యాయాలు..మోదీ, అమిత్ షా లు చంద్రబాబుకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబుతో స్వయంగా మోదీ కూటమిలో బరిలో దిగారు.. అంతేకాకుండా.. గతంలో ఉన్న వైరాన్ని పక్కన బెట్టి ఏపీలోప్రచారం నిర్వహించి భారీగా సీట్లుగెలుచుకున్నారు. 

7 /7

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలంటే చంద్రబాబు పాత్ర ఇప్పుడు కీలకంగా మారింది. తాజాగా, ఢిల్లీలో జరిగిన కూటమి మిత్రుల మీటింగ్ లో మోదీ పక్కన చంద్రబాబు సీటు కేటాయించడం ట్రెండింగ్ లో నిలిచింది. చంద్రబాబు సీట్లు ఇప్పుడు ఢిల్లీలో మోదీ ప్రభుత్వం ఏర్పాటుకు తప్పనిసరిగా మారిందని చెప్పుకొవచ్చు. దీంతో దేశ రాజకీయాలు ఇప్పుడు చంద్రబాబు చుట్టే తిరుగుతున్నాయి. తెలుగు వాడికి దక్కిన గొప్ప గౌరవంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు చంద్రబాబు ట్రెండింగ్ గా మారారు.