Shruti Haasan: వాటికి అడిక్ట్ అయిపోయినా శృతి హాసన్.. తెల్లార్లు అదే పనిగా చూస్తోన్న భామ..

Shruti Haasan: శృతి హాసన్ గురించి చెప్పాలంటే కమల్ హాసన్ కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసినా.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ భామ వింత వ్యాధితో బాధపడుతోంది. అంతేకాదు తెల్లార్లు అదే పనిగా ఆ వీడియోలను చూస్తూ కాలం వెల్లదీస్తోందట. దీనికి సంబంధించి ఇండస్ట్రీలో పెద్ద చర్చే నడుస్తోంది.

1 /6

శృతి హాసన్ గత యేడాది బాగా కలిసొచ్చింది. 2023 ప్రారంభంలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉంది. అంతేకాదు ఇయర్ ఎండింగ్ లో ‘సలార్’ మూవీతో మరో హిట్ అందుకొని మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది.  

2 /6

గత కొన్నేళ్లుగా ఈ భామ ప్రముఖ ఆర్టిస్ట్ శంతను హజారికాతో ఎఫైర్ నడిపింది. అంతేకాదు కొన్నేళ్లుగా ముంబైలోని ఓ ఇంట్లో వీళ్లిద్దరు సహ జీవనం చేస్తున్నారు. వీళ్లిద్దరి మధ్య ఎక్కడ చెడిందో కానీ.. ప్రస్తుతం అతనికి బ్రేకప్ చెప్పి ఒంటిరి జీవితాన్ని లీడ్ చేస్తోంది. ఈ విషయం ఆమె తన ఇన్ స్టాలో అతనితో ఉన్న ఫోటోలను డిలీట్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

3 /6

అంతకు ముందు లండన్ కు చెందిన మైఖేల్ తో కూడా చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. అంతేకాదు అతనితో దగ్గరగా ఉన్న ఫోటోలను అప్పట్లో  షేర్ కూడా చేసింది. అతనికి బ్రేకప్ చెప్పిన తర్వాత 2019లో శంతనుకు దగ్గరయింది.  

4 /6

తాజాగా అతనికి కూడా బ్రేకప్ చెప్పడంతో ప్రస్తుతం సింగిల్ గానే లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఇద్దరితో చెడటంతో ఇకపై ప్రేమ జోలికి పోనంటోంది ఈ భామ.

5 /6

దీంతో రాత్రిళ్లు నిద్ర పట్టక.. అందరు నిద్రపోయాక శృతి మాత్రం కొన్ని మీమ్స్ ను తన సన్నిహితులకు పంపిస్తూ టైమ్ పాస్ చేస్తోందంట. ఈ విషయమై  అందరు మాట్లాడుకుంటున్నారు.

6 /6

మొత్తంగా రాత్రిళ్లు ఒంటరిగా నిద్ర పట్టకపోవడం వలన ఆమె ఇలా చేస్తూ సమయాన్ని స్పెండ్ చేస్తున్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో అడివి శేష్.. డెకాయిట్ మూవీతో పాటు ‘సలార్ 2 ’ మూవీస్ ఉన్నాయి.