Singer Sunitha: సింగర్ సునీత ఫోటోలు వైరల్.. స్వరంలోనే కాదు అందంలో కూడా క్వీన్..!

Singer Sunitha Personal Life 
సింగర్ సునీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆమె పాడితే.. కోకిల పాడినట్టు ఉంటుంది అని ఎన్నో కామెంట్లు పెడుతూ ఉంటారు. సునీత తన పర్సనల్ లైఫ్ వల్ల కూడా ఖర్చు వార్తలో నిలుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ సింగర్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు తెగ వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 

1 /6

ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో.. అనే సాంగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సింగర్ సునీత. ఆ తరువాత ఎన్నో మధుర గీతాలు పాడి.. తెలుగు ప్రేక్షకుల మదిలో చెరిగిపోని స్థానం సంపాదించుకుంది. 

2 /6

ఇక సింగర్ గానే కాకుండా.. తన అందం వల్ల కూడా సునీత.. అభిమానుల మనసు ఆకట్టుకుంటూ ఉంటుంది. అప్పట్లో ఈ సింగర్ కి సినిమా అవకాశాలు సైతం వచ్చాయి అని రూమర్స్ వచ్చాయి. 

3 /6

ముఖ్యంగా నాగార్జున సినిమాలో కూడా ఛాన్స్ వచ్చిందని.. అయితే సునీత మాత్రం ఒప్పుకోలేదని ఎన్నో వార్తలు వినిపించాయి. ఇక ఈ సింగర్ కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో.. ఇది నిజమే అని చెప్పుకొచ్చింది.

4 /6

కాగా సినిమాల వల్లే కాదు.. పర్సనల్ లైఫ్ ద్వారా కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది సునీత. మొదటి పడతతో విడాకులు తీసుకున్న సునీత.. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి మ్యాంగో మీడియా అధినేత రామ్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 

5 /6

అయితే సునీతకి మొదటి పెళ్లి వల్ల ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఈమధ్య ఈ సింగర్ మళ్లీ ప్రెగ్నెంట్ అంటూ వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. అయితే ఇవన్నీ నిజాలు కాదు అని సునీత కొట్టి పడేసింది. 

6 /6

ఈ క్రమంలో ప్రస్తుతం సింగర్ సునీత ఇంస్టాగ్రామ్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సునీత చీరలో ఉన్న ఫోటోలు వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.