Small savings schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత త్రైమాసికం డిసెంబర్ 31 తో ముగిసిన నేపథ్యంలో జనవరి , మార్చి త్రైమాసికానికి గాను ఈ పథకాల వడ్డీరేట్లు ప్రకటించింది. దీనిలో సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్స్ వంటివి ఉన్నాయి. చివరిసారిగా 2023 లో డిసెంబర్లో జనవరి -మార్చి గాను ఈ రెండు పథకాల వడ్డీ రేటును పెంచింది కేంద్ర ప్రభుత్వం.
Small savings schemes: మనం పెట్టుబడులు పెట్టేందుకు ఎన్ని ఆప్షన్లో ఉన్నా.. ఇప్పటికి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లేదా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటుంది. నిర్దిష్ట వడ్డీ రేటు ప్రకారం గ్యారెంటీ రిటర్న్స్ కూడా వస్తాయి. ఎలాంటి రిస్క్ ఉండదు. చిన్న ముత్తాల్లో కూడా డిపాజిట్లు చేసుకోవచ్చు. దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో రాబడి అందించే ఎన్నో పథకాలు ఇందులో ఉన్నాయి.
ఇక ప్రతి మూడు నెలలకోసారి ఇక్కడ వడ్డీ రేటును కేంద్రం సమీక్షించి పెంచడం లేదా తగ్గించడం లేదా స్థిరంగా ఉంచడం వంటివి చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అక్టోబర్ -డిసెంబర్ త్రైమాసికం ముగిసిన నేపథ్యంలో జనవరి మార్చి క్వార్టర్ గాను ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కొత్త వడ్డీ రేటును ప్రకటించింది కేంద్రం. అయితే మరోసారి నిరాశ ఎదురయిందని చెప్పవచ్చు. దీంతో వడ్డీరేట్లు పెరుగుతాయని ఆశలు పెట్టుకున్న వారికి మరోసారి నిరాశ ఎదురైంది.
ఈ పోస్ట్ ఆఫీస్ స్కీములో పబ్లిక్ ప్రావిడెంట్ అత్యంత ఆదరణ పొందిందని చెప్పవచ్చు. దీంట్లో వడ్డీ రేటు మాత్రం ప్రస్తుతం వార్షిక ప్రాతిపదికన 7.10 శాతంగా మాత్రమే ఉంది. ఇది ఎప్పటినుంచో పెరుగుతుందని వాదన వినిపించినా పెరగట్లేదు. కొత్త సంవత్సరం వేళ ఇక్కడ వడ్డీ రేటు పెరుగుతుందని చూసిన వారికి మరోసారి నిరాశ ఎదురయిందని చెప్పవచ్చు.
చివరిసారి కేంద్రం 2024 జనవరి -మార్చి త్రైమాసికంలో సుకన్య సమృద్ధి పథకం మూడేళ్ల టెన్యూర్ పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ స్కీం వడ్డీ రేట్లు పెంచింది తర్వాత అప్పటి నుంచి దాదాపు సంవత్సరం గడుస్తున్నా ఒక్క స్కీం వడ్డీ రేటును కూడా మార్చలేదు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సుకన్య సమృద్ధి యోజన, పిపిఎఫ్ వడ్డీ స్మాల్ సేవింగ్స్ కి స్కీమ్స్ వడ్డీ రేట్లు జనవరి ఉండనున్నాయి అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పినట్లు పిటిఏ కథనం వెల్లడించింది.
మరోవైపు ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న సుకన్య సమృద్ధి యోజన సహా సీనియర్ సిటిజన్స్ కోసం ఉన్న సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లు ప్రస్తుతం 8.20 శాతంగా ఉండగా ఇదే అత్యధికమని చెప్పవచ్చు. అయితే కొన్ని త్రైమాసికాలుగా ఈ స్కీం లలో వడ్డీ రేట్లు ఏమాత్రం మారలేదు.
పిపీఎఫ్ లో ఆర్థిక సంవత్సరంలో కనీసం 500 రూపాయలు ఇన్వెస్ట్ చేయవచ్చు. వరుసగా 15 ఏళ్లు కట్టాల్సి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజనలో మాత్రం 250 తోనే అకౌంట్ తీసుకోవచ్చు. వీటిలో గరిష్టంగా 1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు
ఎస్సీ ఎస్ఎస్ లో కూడా 1000 రూపాయలు ఉంటే చాలు. గరిష్టంగా 30 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పాత పన్ను విధానంలో వీటిలో ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 1,50,000 వరకు ఆదా చేసుకోవచ్చు.