Ring of Fire: ఈ ఏడాది చివరి చంద్ర గ్రహణం అక్టోబర్ 14న ఉంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఈ సూర్య గ్రహణం వీక్షించవచ్చు. సూర్య గ్రహణం నాడు కన్పించే అరుదైన దృశ్యాన్ని రింగ్ ఆఫ్ పైర్ అని పిలుస్తారు.
Ring of Fire: అసలు ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏమిటి, దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి, ఇండియాలో సూర్య గ్రహణం కన్పిస్తుందా లేదా అనేది పరిశీలిద్దాం.
సూర్య గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. ప్రత్యేక బ్లాక్ గ్లాసెస్ సహాయంతో చూడాలి. లేకపోతే కళ్లపై ప్రభావం పడవచ్చు.
ఈసారి సూర్య గ్రహణం ఇండియాలో కన్పించదు. ప్రపంచంలోని పశ్చిమ భాగంలో పూర్తిగా కన్పిస్తుంది. ముఖ్యంగా మెక్సికో, యూకైటన్, గ్వాటెమోలా, హోండ్సురాస్, కోస్టారికాల్లో కన్పించనుంది.
సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు గోళాకారంలో రింగ్ ఏర్పడుతుంది. సాధారణ సూర్య గ్రహణాల్లో ఇది కన్పించదు. కానీ అక్టోబర్ 14న ఏర్పడనున్న సూర్య గ్రహణంలో కన్పిస్తుంది.
ఈ ఘటనను రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. సూర్యుడికి , భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడి భాగం సూర్యుడిని కప్పగా మిగిలిన సూర్యుడి భాగం నుంచి కిరణాలు వెదజల్లినట్టు కన్పిస్తాయి.
ఈసారి సూర్య గ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది.2012 తరువాత తొలిసారిగా ఈ సూర్య గ్రహణాన్ని అమెరికాలోని అన్ని ప్రాంతాల్లో వీక్షించవచ్చు. ప్రత్యేకించి ఈ సూర్య గ్రహణాన్ని పశ్చిమ భూభాగంలో చూడవచ్చు.
ఖగోళంలో జరిగే చాలా ఘటనల వెనుక సీక్రెట్ ఇప్పటికీ అంతుచిక్కకుండా ఉంది. సూర్యుడు, భూమి. చంద్రుడి కదలికపై ఇప్పటికీ పరిశోధన జరుగుతూనే ఉంది.