Debut 100 Crores Filims: సౌత్లో మొదటి సినిమాతోనే 100 కోట్లు కొట్టిన డైరెక్టర్లు..ఇద్దరు సుకుమార్ శిష్యులే!

South indian Directors 100 Crores Gross With Debut Films: సౌత్ సినీ పరిశ్రమలో మొదటి సినిమాతోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టిన డైరెక్టర్ల లిస్టు చూస్తే అందులో ఇద్దరు డైరెక్టర్లు సుకుమార్ శిష్యుల్లో ఉన్నారు. మరి మిగతా ఇద్దరు ఎవరు? ఆ వివరాలు లోకి వెళ్దాం పదండి

  • Apr 09, 2023, 12:29 PM IST
1 /5

ఈ మధ్యకాలంలో కంటెంట్ ఉంటే చాలు ఎలాంటి సినిమా నైనా  ప్రేక్షకులు సూపర్ హిట్ లుగా నిలబెడుతున్నారు అందులో భాగంగానే సౌత్ లో డైరెక్టర్ గా మొదటి సినిమాతోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన దర్శకులు ఎవరు అనే విషయం మీద ఒకసారి లుక్కేద్దాం.    

2 /5

తమిళ డైరెక్టర్ సిబి చక్రవర్తి శివ కార్తికేయన్ హీరోగా డాన్ అనే సినిమా రూపొందించాడు. కాలేజీలో జరిగే ఒక వినోదాత్మక సినిమాగా ఈ సినిమా తెరకెక్కి తమిళంలో దాదాపు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.    

3 /5

అప్పటివరకు నటుడిగా సత్తా చాటిన పృథ్వీరాజ్ లూసిఫర్ అనే సినిమాతో డైరెక్టర్ గా మారి మోహన్లాల్కి భారీ బ్లాక్ బస్టర్ ఇవ్వడమే కాకుండా తాను కూడా 100 కోట్ల కలెక్షన్లు రాబట్టిన సినిమా డైరెక్టర్గా నిలబడ్డాడు.    

4 /5

సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదెల నాని హీరోగా తెరకెక్కించిన దసరా సినిమాతో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి మొదటి సినిమాతోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన డైరెక్టర్ గా నిలబడ్డాడు.  

5 /5

సుకుమార్ శిష్యుడు అయిన బుచ్చిబాబు సాయి ధరంతేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ హీరోగా తెరకెక్కించిన మొదటి సినిమాతోనే 100 కోట్లు గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన సినిమా డైరెక్టర్ గా నిలబడ్డాడు.