Shani Trayodashi: శ్రావణ మాసం.. శని త్రయోదశి రోజు ఇలా చేస్తే.. ఇంట్లో లక్ష్మీ కటాక్షమేనంట..

Sravana masam 2024: శ్రావణ మాసంలో ప్రతిరోజు ఎంతో పవిత్రంగా భావిస్తారు.  ఈమాసంలో ఏదో ఒక పండగ ఉంటునే ఉంటుంది. ముఖ్యంగా సోమ, శుక్ర, శనివారాలను ఎంతో పవిత్రంగా భావిస్తారు.

1 /6

శ్రావణ మాసంలో శనివారంకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా సూర్యుడి కుమారుడు శనిదేవుడు ఈ మాసంలో ఏ పూజలు చేసిన, వ్రతాలు చేసిన ఎంతో ప్రసన్నుడవుతాడంట. అందుకే శనివారం రోజు పరిహారాలు పాటించాలి.  

2 /6

శనిదేవుడిని చాలా మంది చెడు గ్రహాంగాభావిస్తారు. కానీ ఆయన మనం చేసుకున్న కర్మలను బట్టి మాత్రం ఫలితాలు ఇస్తాడు. మంచి పనులు చేస్తే, మంచి ఫలితాలు, చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు కల్గుతాయి. అందుకే చెడు పనులు చేయోద్దని పండితులు చెబుతుంటారు.

3 /6

శ్రావణ మాసంలో శనివారం, అది కూడా త్రయోదశికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆగస్టు 16న  శనిత్రయోదశి ఈ మాసంలో జరుపుకుంటున్నాం. ఈరోజు ఎలాంటి ఫలితాలు చేసిన కూడా రెట్టింపు మంచి ఫలితాలు కల్గుతాయి.   

4 /6

శనివారంరోజున.. నల్ల చీమలకు చక్కెర ఆహారంగా వేయాలి. బెల్లం కూడా వేస్తే మంచిది. మేడిచెట్టును దేవతాగా భావిస్తారు. నెయ్యితో శనివారం నాడు దీపారాధన చేయాలి. ఏలినాటి శని, అర్ధష్టమ శని, సాడేసాతితో బాధపడుతున్న వారు ఈరోజు శనికి తైలాభిషేకం చేయించాలి.

5 /6

నల్లనువ్వులు, నూనెలను ఒక గిన్నెలో వేసుకుని, ఇంటి యజమాని ఇంట్లో అంతా దిష్టి తీసి ప్రవహిస్తున్న నీటిలో వదిలేసి, ఆ తర్వాత వెనక్కు తిరిగి చూడకుండా.. మరల ఇంటికి వచ్చి కాళ్లు చేతులుకడుక్కొని ప్రవేశించాలి. ఇలా చేస్తే.. ఆ ఇంట్లో డబ్బులకు ఎప్పుడు కూడ కొదువ అనేదే ఉండదు. 

6 /6

ఏలినాటి, అర్ధష్టమ, సాడేసాతి ప్రభావం ఉన్నవారు... ఇనుము వస్తువుల్ని, నూనెను ప్రవహిస్తున్న నీళ్లలో వదిలేయాలి. ఇంట్లో ఎల్లప్పుడు కూడా పనికి రాని వస్తువుల్ని ఉంచుకోకూడదు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)