Sreeleela: బాయ్ ఫ్రెండ్ తో వెకేషన్ కి వెళ్ళిన శ్రీలీల..ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన భామ..!

Sreeleela boyfriend : తెలుగు సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన శ్రీలీల ఈతరం హీరోయిన్లకు సాధ్యం కానీ రికార్డులను క్రియేట్ చేసింది. ఓకే ఏడాది దాదాపు 9 సినిమాలకు సంతకం చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. తాజగా శ్రీలీల కి సంబంధించన ఒక వార్త..ప్రస్తుతం సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతోంది..

1 /5

శ్రీలీల కి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో.. దక్కిన క్రేజ్ ఇప్పుడు కనిపించడం లేదని చెప్పాలి. ఒకవైపు ఎంబిబిఎస్ విద్యను పూర్తి చేసే పనిలో పడ్డ ఈమె.. మరొకవైపు సినిమాలలో కూడా నటిస్తూ మెప్పిస్తోంది.  

2 /5

అందచందాలతో నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె యంగ్ హీరోలను మొదలుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు , బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించి మంచి పేరు దక్కించుకుంది. 

3 /5

ఇప్పటివరకు ఎలాంటి రూమర్స్ కి చోటు ఇవ్వని శ్రీ లీల.. తాజాగా బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతోంది.. అంటూ ఒక వార్త  తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను,  వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకునే ఈమె తాజాగా ఇంస్టాగ్రామ్  లో కొన్ని ఫోటోలతో పాటు వీడియోలు కూడా షేర్ చేసింది.

4 /5

వీటిని చూస్తూ ఉంటే.. ఈమె ఫారిన్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది. అంతేకాదు శ్రీ లీల షేర్ చేసిన ఫోటోలలో ఒక అబ్బాయి కూడా కనిపించారు. దీంతో ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో వెకేషన్ కి.. వెళ్ళిందంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. 

5 /5

మరి శ్రీ లీలా షేర్ చేసిన ఫోటోలలో ఆ అబ్బాయి ముఖం కనిపించకుండా జాగ్రత్త పడింది. దీంతో అబ్బాయి ఎవరు..? అతనితో ఏం మాట్లాడుతోంది..? సడన్గా ఫారిన్ వెళ్లడానికి కారణం ఏమిటి..? అంటూ రకరకాల ప్రశ్నలు గుప్పిస్తున్నారు నెటిజన్స్.