Sreeleela: కిస్సిక్‌ సాంగ్‌ డ్యాన్స్‌ చేస్తే అమ్మ కొడుతుంది.. పుష్ప 2 సాంగ్‌పై శ్రీలీల నాటీ రిప్లై..!

Sreeleela Naughty Reply On Kissik Song: పుష్పా2 సినిమా నటి శ్రీ లీల కిస్సిక్‌ సాంగ్‌పై నాటీ కామెంట్ చేశారు. కిస్పిక్‌ సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్‌లో శ్రీలీల చేసిన డాన్స్ కి అంతా ఫిదా అయిపోయారు. పాటకు తగ్గట్టు స్టెప్పులు వేస్తూ అదరగొట్టింది. అయితే ఇటీవల ఈ పాటపై శ్రీ లీల నాటీ రిప్లై కామెంట్‌ చేసింది. ఈ కామెంట్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 

1 /5

పుష్ప2 సినిమా బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. ఇక పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ లో అదరగట్టుగా.. పుష్ప 2 లో శ్రీ లీల మరొక ప్రత్యేక సాంగ్ తో అదరగొట్టింది.  

2 /5

అయితే పుష్ప 2 సినిమాలో నటి శ్రీ లీల కిస్సిక్‌ సాంగ్ పై సూపర్ డాన్స్ వేసింది. ఆమె డాన్స్ కి అంతా ఫిదా అయ్యారు సాంగ్ కు బన్నీతో పోటీపడీ మరీ స్టెప్పులు వేస్తూ అదరగొట్టిన శ్రీలీల కిస్సిక్‌ సాంగ్‌పై తాజాగా స్పందించింది.  

3 /5

శ్రీలీల తన తల్లితో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో తళుక్కుమంది అక్కడే ఉన్న మీడియా ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసుకున్నారు. అయితే శ్రీలీలను కిస్సిక్‌ స్టైల్ లో ఫోటో కావాలని అడగగా అమ్మ కొడుతుంది ఆ డాన్స్ చేస్తే అని స్పందించింది.  

4 /5

శ్రీలీల కిస్సిక్ డాన్స్ పై చేసిన ఈ సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రేజీ పాప ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ, రవితేజ, నాగచైతన్య, అఖిల్ సినిమాలో నటిస్తోంది.  

5 /5

ఇటీవల సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ప్రచారం చేయొద్దని కూడా శ్రీ లీల ప్రకటించిన సంగతి తెలిసిందే .రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి సందD' సినిమాతో తెలుగు సినిమాలో అరంగేట్రం చేసింది శ్రీలీల.