Sreemukhi: కోలీవుడ్ బడా హీరో సినిమాలో బంపరాఫర్ కొట్టేసిన శ్రీముఖి.. ?

Sreemukhi: శ్రీముఖి తెలుగు టీవీ వ్యాఖ్యాతగా  తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తోంది. అంతేకాదు యాంకర్‌గా ఆమె కంటూ ఓ సెపరేట్  ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం శ్రీముఖి ఓ వైపు సినిమాలు.. మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో దుమ్ము దులుపుతుంది.   అంతేకాదు వీలైనపుడల్లా తన అందాలతో అదుర్స్ అనిపిస్తోంది.

1 /6

శ్రీముఖి టీవీ యాంక‌ర్ గా ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ప్రస్తుతం సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే సైడ్ క్యారెక్టర్స్ తో  సత్తా చూపెడుతోంది శ్రీముఖి.

2 /6

శ్రీముఖి.. తెలుగు టెలివిజన్ యాంకర్‌గా కెరీర్ మూడు సినిమాలు.. ఆరు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అన్నట్టుగా కెరీర్ సాగిపోతుంది. శ్రీముఖి.. ఎపుడు ముఖం చెరగని నవ్వుతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు వీలైనపుడల్లా సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ తో రచ్చ చేయడం శ్రీముఖి మార్క్ స్టైల్.

3 /6

  శ్రీముఖికి ఇపుడు తెలుగుతో పాటు హిందీ, తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా అజిత్ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఈమెకు ఇంపార్టెంట్ పాత్ర చేస్తున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

4 /6

అప్పట్లో నాగార్జున తొలిసారి హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 రియాలిటీలో తెలుగులో రన్నరప్‌గా నిలిచింది. ఈ రియాలిటీ షోలో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచాడు. బిగ్‌బాస్ రియాలిటీ షోతో శ్రీముఖి తెలుగు ఆడియన్స్ కు మరింత చేరువ అయింది. ఈ షో శ్రీముఖి చేసిన అల్లరిని ఎవరు మరిచిపోలేదు.

5 /6

గతేడాది  మెగాస్టార్  చిరంజీవి  టైటిల్ రోల్లో నటించిన 'భోళా శంకర్' మూవీతో పలకరించింది శ్రీముఖి. ఈ మూవీ శ్రీముఖి కెరీర్ లో ఓ మచ్చగా మిగిలింది.

6 /6

  గత కొన్నేళ్లుగా శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ఇది రూమరా.. నిజమా అనేది శ్రీముఖి క్లారిటీ ఇస్తే బాగుంటుంది.