Tamannaah Bhatia: కాటుక కళ్ళతో కట్టిపడేస్తున్న మిల్క్ బ్యూటీ.. చూస్తే తట్టుకోలేరు..!

Tamannaah Bhatia hot photos: ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన హెవీ డిజైనర్ గౌన్ ధరించిన తమన్న,  పర్పుల్ కలర్ గౌన్ లో తన అందాలతో ఆకట్టుకుంది. కాటుక కళ్ళతో యువతను కట్టిపడేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె  షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి 

1 /5

ప్రముఖ టాలీవుడ్ బ్యూటీ తమన్నా తన అందచందాలతో యువతను కట్టిపడేస్తూ ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాలకు పైగానే అవుతున్నా, వన్నె తరగణి అందంతో ఆకట్టుకుంటోంది. మిల్క్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న తమన్నా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరు సరసన నటించి, మెప్పించి ఆకట్టుకుంది.

2 /5

హీరోలతోనే కాదు హీరోల తండ్రులతో కూడా కలిసి నటించిన ఘనత ఈమె సొంతం. రామ్ చరణ్ తో రచ్చ సినిమాలో రొమాన్స్ చేసిన ఈమె , ఆయన తండ్రి ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో కూడా ఆయన సరసన నటించింది.

3 /5

ఇక ఇటీవల శ్రద్ధా కపూర్ లీడ్ రోల్ పోషించిన హారర్ కామెడీ చిత్రం స్త్రీ 2 లో ఐటమ్ సాంగ్ లో నటించి మెప్పించింది. ఇందులో కేవలం ఐదు నిమిషాల  ఐటమ్ సాంగ్ కోసం ఏకంగా కోటి రూపాయల పారితోషకం తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. దీన్ని బట్టి చూస్తే ఈమె రేంజ్ ఏపాటితో అర్థం చేసుకోవచ్చు.

4 /5

ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అందరిని ఫిదా చేసే  తమన్న తాజాగా మరొకసారి ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన డ్రెస్ ధరించి అందరిని ఆకట్టుకుంది. హెవీ ఎంబ్రాయిడరీ డిజైన్ కలిగిన పర్పుల్ కలర్ గౌన్ ధరించిన ఈ ముద్దుగుమ్మ,  తన అందాలతో మరొకసారి ఆకట్టుకుంది. గ్లామర్ తోనే కాదు కాటుక కళ్ళతో యువతను కట్టిపడేసిందని చెప్పవచ్చు. 

5 /5

హెవీ డిజైనర్ గౌన్ ధరించిన తమన్నా ఎటువంటి జ్యువెలరీ ధరించకుండా కేవలం చేతికి మాత్రం గోల్డెన్ కలర్ బ్రాస్లెట్ మాత్రమే ధరించి ఆకర్షణీయంగా కనిపించింది. ఇక తాజాగా ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇందులో తన అందచందాలతో పాలమీగడ లాంటి మేనితో మరొకసారి నెటిజన్స్ ను ఆశ్చర్యపరిచింది.ఇక ఈమె వ్యక్తిగత విషయానికొస్తే. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆయన విజయ్ వర్మతో ప్రేమలో మునిగి తేలుతోంది. త్వరలోనే వివాహం కూడా చేసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడితో డేటింగ్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.