Telangana Budget 2024: తెలంగాణ ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టింది. రూ. 2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. అయితే, ఎప్పటి మాదిరి ఈ సారి కూడా రైతులకు పెద్దపీట వేసింది తెలంగాణ ప్రభుత్వం.
ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగానికి రూ.72.659 కోట్లు కేటాయించారు. అయితే, ఇందులో భూమిలేని రైతులకు కూడా బంపర్ ఆఫర్ ప్రకటించింది రేవంత్ సర్కార్.
ఎన్నో ఏళ్లుగా భూమినే నమ్ముకుని ఉన్న రైతుకు కూడా ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో సొంత భూమిలేని రైతులకు ఏటా రూ. 12,000 అందించనున్నట్లు భట్టి తెలిపారు. ఈ సాయం ఈ ఏడాది నుంచే వర్తించనుందని అసెంబ్లీలో వెల్లడించారు.
బడ్జెట్లో రూ. 2,20,945 రెవెన్యూ వ్యయం కాగా, రూ. 33,487 కోట్లు వ్యయం. భూమిలేని రైతులకు ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే దిశగా ఈ సాయం అందించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు.
ఇది లా ఉండగా రూ.29,816 కోట్లు పంచాయితీ రాజ్‌కు కేటాయించారు. ఈ బడ్జెట్‌లో విద్యుత్ శాఖ రూ. 16,410 కోట్లు, పరిశ్రమశాఖకు రూ. 2,762 కోట్లు, రోడ్లు భవనాలకు రూ. 5,790 కోట్లు ప్రకటించగా ఇక మహిళల కోసం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకానికి రూ. 2,418 కోట్లు, రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకానికి రూ. 723 కోట్లు ప్రకటించింది.
మెట్రో విస్తరణకు రూ. 100 కోట్లు, ట్రిపుల్ ఆర్‌ఆర్‌ఆర్ రూ. 1525 కోట్లు, జీహెచ్‌ఎంసీ మౌలిక వసతులకు రూ. 3,050 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్లుకు రూ. 1500 కోట్లు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. త్వరలోనే నిజాం షుగర్‌ను కూడా పునరుద్ధరిస్తామని భట్టి తెలిపారు.