Bottle Gourd Side Effects: కూరగాయాల్లో ఒకటి పొట్లకాయ. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కానీ కొన్ని వ్యాధులు ఉన్నవారు ఈ పొట్లకాయను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి.
Bottle Gourd Side Effects: కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. పొట్లకాయ కూరగాయల్లో ఒకటి. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. కానీ ఇది కొంతమందికి అసలు సరికాదు. అయితే ఈ సమస్యలు ఉన్నవారు పొట్లకాయను అసలు తీసుకోకుండా ఉండాలి.
పొట్లకాయలో అధిక మొత్తంలో నీరు , ఫైబర్ ఉంటుంది. మీకు అపానవాయువు, గ్యాస్, అజీర్ణం లేదా అతిసారం వంటి సమస్యలు ఉంటే దీనిని తీసుకోవడం వల్ల సమస్యలను పెంచుతుంది.
పొట్లకాయలో ఆక్సలేట్ అనే పదార్ధం ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లను తయారు చేస్తుంది. మీకు కిడ్నీలో స్టోన్ లు ఉంటే దీనిని అసలు తీసుకుండా ఉండాలి .
సీసా పొట్లకాయ రక్తంలో షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. మీకు హైపోగ్లైసీమియా ఉన్నట్లయితే పొట్లకాయను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించండి.
మీకు అలర్జీ సమస్యలు ఉన్నట్లయితే పొట్లకాయను ఎక్కువగా తినకూడదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
రక్తపోటు ఉన్నవారు పొట్లకాయను తక్కువ పరిమాణంలో తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే తల తిరగడం, మూర్చ వచ్చే అవకాశం ఉంటుంది.