Tollywood highest Theatres Count: ‘కల్కి’ సహా ఎక్కువ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఇవే.. పార్ట్ -1

Tollywood highest Theatres Count: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘కల్కి 2898 AD’ ఫీవర్ నడుస్తోంది. ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేస్తే చాలు క్షణాల్లో అమ్మడైపోతున్నాయి దీంతో ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనేది అర్థమవుతోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి థియేటర్స్ లో విడుదలవుతోంది. మొత్తంగా కల్కి సహా ఎక్కువ థియేటర్స్ లో విడుదలైన చిత్రాల విషయానికొస్తే..

1 /5

RRR రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్ హీరోలుగా  తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 10200 పైగా థియేటర్స్ లో విడుదలైంది.

2 /5

బాహుబలి 2 రాజమౌళి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా  నటించిన బాహుబలి 2. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 8500 నుంచి 9 వేల  స్క్రీన్స్ లో విడుదలైంది.  

3 /5

కల్కి 2898 AD నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన మూవీ  ‘కల్కి 2898 AD’. ఈ సినిమా 8200 నుంచి 8500 థియేటర్స్ లో విడుదల కాబోతుంది. 

4 /5

సాహో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహో’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 7978 స్క్రీన్స్ లో విడుదలైంది.

5 /5

రాధే శ్యామ్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా అప్పట్లోనే  7వేలకు పైగా స్క్రీన్స్ లో విడుదలైంది.