Migraine Headache: మందులు లేకుండా మైగ్రేన్‌ తలనొప్పికి పరిష్కారం.. ఈ చిట్కాలు పాటించండి

These Reasons Of Migraine Headache And Follow These Tips: మైగ్రేన్‌ తలనొప్పికి పరిష్కారం కావాలంటే ముందు కారణాలు తెలుసుకోవాలి. అవి తెలిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మైగ్రేన్‌ తలనొప్పికి మెదడు పనితీరులో మార్పులు, రసాయన మార్పులు, జన్యు, పర్యావరణం వంటివి కారణాలుగా కనిపిస్తున్నాయి. మైగ్రేన్‌ నొప్పి నివారణకు ఈ చిట్కాలు పాటించండి.

1 /7

Migraine Headache: మందులు లేకుండా మైగ్రేన్‌ తలనొప్పికి పరిష్కారం.. ఈ చిట్కాలు పాటించండి

2 /7

Migraine Headache: మైగ్రేన్‌ తలనొప్పి ఉంటే చాలా ఇబ్బందులు పడుతుంటారు. తరచూ తలనొప్పితో బాధపడుతుండడంతో చిరాకుగా ఉంటారు. ఈ సమస్యకు చిట్కాలు ఇవే!

3 /7

Migraine Headache: మైగ్రేన్‌ తలనొప్పికి.. మనం తినే ఆహారానికి మధ్య సంబంధం ఉంది. మైగ్రేన్ తలనొప్పి రాకుండా సమతుల్య ఆహారం చాలా అవసరం. మైగ్రేన్ తలనొప్పి బాధితులు పాల ఉత్పత్తులు, గుడ్లు, పుల్లటి ఆహారపదార్థాలు, గ్లూటెన్ కలిగిన ఆహారాలు తీసుకోవద్దు.

4 /7

Migraine Headache: హార్మోన్ల అసమతుల్యత కూడా మైగ్రేన్‌కు కారణం కావచ్చు. మహిళలకు అత్యధికంగా మైగ్రేన్ తలనొప్పి రావడానికి ఇదే కారణం. ఋతుస్రావం సమయంలో మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది క్రమంగా మైగ్రేన్ తలనొప్పికి దారి తీస్తుంది. ఆల్కహాల్, అధికంగా తీపి పదార్థాలు తీసుకోవడం.. పిండి పదార్థాలు తగ్గించాలి.

5 /7

Migraine Headache: శరీరంలో మెగ్నీషియం లోపం తలెత్తితే తలనొప్పి, మైగ్రేన్‌ సమస్యకు కారణమవుతుంది. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. అయితే వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మెగ్నీషియం సప్లిమెంట్లపై నిర్ణయం తీసుకోవాలి.

6 /7

Migraine Headache: బ్యాక్టీరియా వల్ల కూడా మైగ్రేన్‌ తలనొప్పి రావచ్చు. అలా అయితే వెంటనే చికిత్స చేయాలి. మీ ఆహారంలో ప్రోబయోటిక్స్, ఒమేగా-3 సమృద్ధిగా ఉండే  ఆహారాలు ఉండాలి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

7 /7

Migraine Headache: మైగ్రేన్‌ తలనొప్పి తగ్గడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి. అధికంగా ఆలోచించడం.. అసహనం.. కోపం తగ్గించుకుంటే మైగ్రేన్‌ తలనొప్పి తగ్గుతుంది.