Tirumala 300 rupees tickets released: తిరుమల శ్రీవారి భక్తులకు తీపి కబురు జనవరి కోటా తిరుమల దర్శనం టిక్కెట్లు విడుదల కానున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు టీటీడీ ప్రకటించింది. 2025 జనవరికి సంబంధించిన శ్రీవారి దర్శనం టిక్కెట్లు అక్టోబర్ 19 శనివారం విడుదల కానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.
తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి నిత్యం లక్షలాది మంది భక్తులు బారులు తీరతారు. వారి కోసం లక్కీ డిప్ ద్వారా టిక్కెట్లు 21వ తేదీ నుంచి అందుబాటులో ఉంచనున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. 23 వ తేదీ పూర్తి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. లక్కీ డిప్ ద్వారా దర్శనం టిక్కెట్లను విడుదల చేస్తారు.
ఇక స్వామివారిక సహస్రదీపాలంకార సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్థిత బ్రహ్మోత్సవం టిక్కెట్లను కూడా ఈనెల 22వ తేదీ ఉదయం పది గంటల నుంచి ఆన్‌లైన్ విడుదల చేస్తారు. భక్తులు గమనించి ముందుగానే టిక్కెట్లను బుక్ చేసుకోవాలి. ఆరోజే వర్చువల్ సేవా టక్కెట్లు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
అక్టోబర్ 23వ తేదీ అంగప్రదిక్షణం టిక్కెట్లను కూడా ఉదయం పది గంటల సమయంలో విడుదల చేయనున్నారు. ఇక శ్రీవాణి కోటా కూడా అదే రోజు విడుదల చేయనున్నారు. ఇక శ్రీవారి రూ. 300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లను 24 వ తేదీ ఉదయం పది గంటల నుంచి ఆన్‌లైన్ అందుబాటులో ఉంచనున్నారు. గదుల కోటా కూడా మధ్యాహ్నం అదేరోజు నుంచి విడుదల చేస్తారు.
నేడు అక్టోబర్ 17వ తేదీ పౌర్ణమి. దీన్ని శరద్ పూర్ణిమ, కొజగరీ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈరోజు తిరుమలలో శ్రీవారికి ప్రత్యేక గరుడసేవ నిర్వహిస్తారు. ప్రతినెలా పౌర్ణమి రోజు తిరుమలలో గరుడ సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
తిరుమాడ వీధుల్లో శ్రీవారు గరుడ వాహనంపై భక్తులను కనువిందు చేయనున్నాడు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)