Gold Price Today: పసిడి ప్రియులకు కాస్త ఊరట.. దిగివచ్చిన బంగారం ధరలు.. ఎంత తగ్గిందంటే?

Gold And Silver Rates Today : పసిడి ప్రియులకు కాస్త ఊరటనిచ్చే విషయం. నిన్న పెరిగిన బంగారం ధర..నేడు కాస్త తగ్గింది. ఆదివారంతో పోల్చితే సోమవారం ధరలు తగ్గాయి. నేడు తులంపై సుమారు రూ. 100 వరకు దిగొచ్చింది. దీంతో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,300కి చేరుకుంది. 
 

1 /6

Gold And Silver Rates Today : దేశంలో బంగారం  ధరలు నేడు కాస్త తగ్గాయి. ఓరోజు పెరగడం..ఓ రోజు తగ్గుతుందనడంతో పసిడిప్రియుల్లో ఆందోళన మొదలైంది. ఎప్పుడు బంగారం కొనుగోలు చేయాలి అనే అయోమయంలో ఉన్నారు. సోమవారం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు దిగివచ్చాయి. ఆదివారంతో పోల్చితే సోమవారం తులం పై ధర రూ. 100 వరకు దిగివచ్చింది. దీంతో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,300కి చేరుకుంది. దేశవ్యాప్తంగా నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 

2 /6

దేశ  రాజధాని ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,900 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,180 వద్ద కొనసాగుతోంది.   

3 /6

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,940గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,300వద్ద కొనసాగుతోంది.   

4 /6

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ. 66,940గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 73,300గా ఉంది.   

5 /6

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో పది గ్రాముల 22  క్యారెట్ల బంగారం ధర రూ. 66,940గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,300గా ఉంది. విశాఖ, విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.   

6 /6

వెండి కూడా బంగారం బాటలో కొనసాగుతుంది. సోమవారం కిలో వెండి ధర రూ. 100 తగ్గింది. ఢిల్లీతోపాటు ముంబై, కోల్ కతా, పూణె వంటి నగరాల్లోనూ వెండి ధర కిలో రూ. 87,900ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖల రూ. 92,900వద్ద ట్రేడ్ అవుతోంది.