Top 10 Highest Grossing Indian Movies: బాహుబలి సినిమాతో భారతీయ బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల మార్క్ అనేది స్టార్ట్ అయింది. ఆ సినిమా తర్వాత కల్కితో కలుపుకుంటే మొత్తంగా ఏడు చిత్రాలు ఈ మార్క్ ను క్రాస్ చేసాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా తాజాగా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. దీంతో వెయ్యి కోట్ల క్లబ్బులో చేరిన 7వ భారతీయ సినిమాగా రికార్డులకు ఎక్కింది.
ఆమీర్ ఖాన్ హీరోగా నటించిన సినిమా ‘దంగల్’. ఈ సినిమా చైనాలో రాబట్టిన వసూళ్లను కలుపుకుంటే మొత్తంగా రూ. 2024 కోట్లు రాబట్టింది. అయితే.. ఈ సినిమా వసూళ్లపై కొన్ని అనుమానాలున్నాయి. ఇవి ఫేక్ అన్న వాళ్లు ఉన్నారు. ప్రస్తుతం భారతీయ చిత్రాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది.
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘బాహుబలి 2’. ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ దగ్గర తొలి రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1810 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1400 కోట్లు గ్రాస్ వసూల్లతో మూడో స్థానంలో ఉంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘కేజీఎఫ్ 2’ . ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1250 కోట్ల గ్రాస్ వసూళ్లతో నాల్గో ప్లేస్ లో ఉంది.
షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార, దీపికా హీరో, హీరోయిన్లుగా నటించిన మూవీ ‘జవాన్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1148 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 5లో నిలిచింది.
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణే హీరో, హీరోయిన్లుగా సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పఠాన్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1050 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 6లో ఉంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 1030 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 7లో నిలిచింది. త్వరలో ఈ సినిమా పఠాన్ రికార్డ్స్ బ్రేక్ చేసినా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు.