Whatsapp Update: మీ వాట్సప్ మీకు తెలియకుండా మరెవరైనా వాడుతున్నారా, ఎలా తెలుసుకోవడం

Whatsapp Update: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే సోషల్ మెస్సేజింగ్ యాప్ వాట్సప్. క్షణాల్లో సమాచారం, ఫోటోలు, వీడియోలు అన్నీ షేర్ చేసుకోవడమే కాకుండా వీడియా కాలింగ్ సౌకర్యం కూడా ఉండటంతో అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. 

Whatsapp Update: అదే సమయంలో వాట్సప్ ప్రాచుర్యంలో వచ్చే కొద్దీ, వినియోగం పెరిగేకొద్దీ హ్యాకింగ్ ముప్పు కూడా పెరుగుతోంది. మీకు తెలియకుండా మీ వాట్సప్ నెంబర్ మరెవరో అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించే ప్రమాదం లేకపోలేదు. ఇదెలా తెలుసుకోవడం...

1 /5

ఈ ఫీచర్ ద్వారా మీ ఎక్కౌంట్ 30 రోజులు యాక్టివ్‌గా లేకపోతే అన్ని లింక్స్ ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ అయిపోతాయి.

2 /5

ఇందులో ఓ లిస్ట్ కన్పిస్తుంది. ఇందులో మీ ఎక్కౌంట్‌తో లింక్ అయిన డివైస్ పేరు, సమయం, డివైస్ ఐడీ కన్పిస్తాయి. ఇది చూడగానే మీ ఎక్కౌంట్ ఎవరైనా వేరే డివై‌స్‌తో లాగిన్ చేశారా లేదా అనేది తెలిసిపోతుంది. వెంటనే డివైస్‌తో లాగ్ అవుట్ చేసేయాలి. ఒక్కొక్క డివైస్ సెలెక్ట్ చేసి లాగౌట్ చేయాలి

3 /5

లింక్డ్ డివైసెస్ ఫీచర్ చెక్ చేసేందుకు ముందుగా వాట్సప్ యాప్ ఓపెన్ చేయాలి. పైన కార్నర్‌లో ఉన్న ప్రొఫైల్ పిక్ ట్యాప్ చేయాలి. ఎక్కౌంట్ ఎంచుకుని డివైస్ ట్యాప్ చేయాలి.

4 /5

వాట్సప్‌లో ఉన్న ఆ ఫీచర్ పేరు లింక్ డివైస్. ఈ ఫీచర్ ఆధారంగా మీ ఎక్కౌంట్‌తో లింక్ అయిన అన్ని డివైసెస్ చూడవచ్చు.

5 /5

హ్యాకర్లు ఎప్పుడూ కొత్త కొత్త పద్ధతుల్లో హ్యాకింగ్ చేస్తుంటారు. అందుకే మీ వాట్సప్ ఎక్కౌంట్ సురక్షితంగా ఉంచుకోండి. వాట్సప్‌లో ఉన్న ఒక ఫీచర్ ద్వారా మీ ఎక్కౌంట్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ లాగిన్ చేశారనేది సులభంగా తెలుసుకోవచ్చు. ఏ డివైస్‌తో మీ ఎక్కౌంట్ లాగిన్ చేశారో కూడా తెలుసుకోవచ్చు.