Top Heroine Shock To Prabhas: ప్రభాస్‌కే హ్యాండిచ్చి.. బాలీవుడ్ హీరోతో డేటింగ్.. ఇంత ఛాన్స్‌ వదులుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

Top Heroine Shock To Prabhas: ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. సినిమా పెద్దలంతా ఆయనను చూసి నేర్చుకోవాలని ఇతర స్టార్ హీరోలకు చెబుతున్నారు. ఒకపక్క రాజా సాబ్ షూటింగ్లో బిజీ ఉన్న ప్రభాస్ రాఘవపూడితో ఫౌజీ మూవీ కూడా చేయడం విశేషం.. అలాగే ఈ 2024 సంవత్సరం చివరిలో స్పిరిట్ కూడా రాబోతోంది. ఆ తర్వాత సలార్ 2తో పాటు కల్కి 2 సినిమాలకు సంబంధించి కూడా అప్డేట్ రాబోతోంది. 
 

1 /6

ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరైన ప్రణాళికతో వరసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. గతంలో డార్లింగ్ ఆదిపురుష్ సినిమాలో ప్రత్యేకమైన నటనతో అందర్నీ ఆకర్షించాడు. అయితే ఇందులోని సీతాదేవి పాత్రలో ప్రధాన హీరోయిన్‌గా కృతిసనన్ నటించారు. అయితే ఈ సమయంలో గ్రాఫిక్స్ ని ఎక్కువగా వాడడంతో హీరోయిన్ చిన్నపిల్లల కనిపించిందని దర్శకుడిపై సినీ ప్రియులంతా మండిపడ్డ విషయం తెలిసిందే..  

2 /6

ఇదిలా ఉంటే ఆదిపురుష్ సినిమా సమయంలోనే డార్లింగ్, కృతి సనన్ పై అనేక రూమర్స్ వచ్చాయి. వీరిద్దరూ ప్రేమలో పడ్డారని నిశ్చితార్థం కూడా ఇటీవలేనే అయిపోయిందని త్వరలోనే పెళ్లి కూడా కాబోతుందని వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే..  

3 /6

అధికారిక ప్రకటన లేకపోవడంతో రూమర్స్ ఎక్కువయ్యాయి. దీంతో వీటి పై ప్రభాస్ కూడా స్పందించారు. తనపై వస్తున్న రూమర్స్ అన్ని పుకార్లే అంటూ ఆయన కూడా కొట్టివేశారు. అయితే ఆదిపురుష్ సమయంలో ఎక్కువగా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఉండడంతో అందరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు భావించడం వల్ల రూమర్స్ ఎక్కువగా వచ్చాయి. 

4 /6

ఇటీవల పెళ్లిపై ప్రభాస్ కూడా క్లారిటీ ఇచ్చాడు.. డార్లింగ్ ఇప్పుడే పెళ్లి చేసుకోడని.. పెళ్లిపై ఎలాంటి ఉద్దేశం లేదని పరోక్షంగా ఓ ఇంటి ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా నిరాశ చెందారు..

5 /6

కానీ కృతి సనన్ మాత్రం డేటింగ్‌లో ఉందని ఇటీవలే వార్తలు బీభత్సంగా వచ్చాయి.. అది ఎవరూ కాదు బాలీవుడ్ లోని ప్రముఖ హీరో కార్తీక్ ఆర్యన్ అని గత కొన్ని రోజుల నుంచి వారిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు కుప్పలు తిప్పలుగా వచ్చాయి. అంతేకాకుండా వారిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు కూడా అందులో రాసుకు వచ్చారు..

6 /6

ఇంతకాలం ప్రభాస్‌తో సన్నిహితంగా ఉన్న కృతి సనన్.. ఇప్పుడు బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో పెళ్లికి రెడీ అవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజానికి ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేవరకు నిజమని నమ్మాల్సిన అవసరం కూడా లేదు. త్వరలోనే వీరిద్దరికి ఉన్న సంబంధంపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.