Diabetes Remedies: ప్రపంచవ్యాప్తంగా మధుమేహం వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఇండియాలో ఈ సమస్య మరింత పెరుగుతోంది. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి ఇందుకు ప్రధాన కారణం. మధుమేహాన్ని సకాలంలో నియంత్రించకుంటే కిడ్నీ, కళ్లు, గుండె, రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ప్రకృతిలో లభించే కొన్ని ఆకులతో డయాబెటిస్‌ను అద్భుతంగా నియంత్రించవచ్చు.
ఇక మామిడి ఆకులు మరింత అద్భుతమైనవి. ఇందులో ఫైబర్, విటమిన్ సి చాలా ఎక్కువ. ఇవి మదుమేహాన్ని నియంత్రిస్తాయి.
ఇక తమలపాకు గురించి అందరికీ తెలిసిందే. కానీ తమలపాకులో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించే అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి.
మరో అద్భుతమైన మొక్క ఇన్సులిన్ ప్లాంట్. ఇందులో ఔషధ గుణాలు చాలా ఎక్కువ. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో కీలకంగా ఉపయోగపడుతుంది.
మరో అద్భుతమైన ఆకులు కలబంద ఆకులు. ఇందులో ఔషధ గుణాలు చాలా ఎక్కువ. రోజూ పరగడుపున తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది.
ఆయుర్వేదం ప్రకారం తులసి ఆకులు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అద్భుతంగా నియంత్రిస్తాయి. తులసి ఆకులు రోజూ పరగడుపున తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెంచుతుంది.
మెంతికూరలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ నియంత్రిస్తుంది. డయాబెటిస్‌కు మెంతుల ఉపయోగం అనాదిగా ఉన్న ఆచారమే.
వేపలో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు వేపలో చాలా ఔషధ గుణాలున్నాయి. ఇందులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రిస్తాయి.
బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు ప్రకృతిలో అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలున్నాయి. ముఖ్యంగా కొన్ని ఆకుల్ని నమలడం ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ అద్భుతంగా తగ్గించవచ్చు.