Vande Bharat Sleeper Pics: వందేభారత్ స్లీపర్ రైలులో సూపర్ లగ్జరీ సౌకర్యాలు, కళ్లు చెదిరే ఫోటోలు

ఇప్పటివరకూ వందేభారత్ రైళ్లను చూశాం. ఇకపై వందేభారత్ స్లీపర్ రైళ్లు చూడనున్నాం. ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు వందేభారత్ స్లీపర్ రైళ్ల లాంచ్‌కు సిద్ధమౌతోంది. దేశంలో ప్రీమియం రైలుగా ఉన్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను తలదన్నేలా ఈ రైలు ఉంటుంది. వందేభారత్ స్లీపర్ రైలు ఎలా ఉంటుందో ఫోటోలు చూద్దాం.

Vande Bharat Sleeper Pics: ఇప్పటివరకూ వందేభారత్ రైళ్లను చూశాం. ఇకపై వందేభారత్ స్లీపర్ రైళ్లు చూడనున్నాం. ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు వందేభారత్ స్లీపర్ రైళ్ల లాంచ్‌కు సిద్ధమౌతోంది. దేశంలో ప్రీమియం రైలుగా ఉన్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను తలదన్నేలా ఈ రైలు ఉంటుంది. వందేభారత్ స్లీపర్ రైలు ఎలా ఉంటుందో ఫోటోలు చూద్దాం.

1 /8

వందేభారత్ స్లీపర్ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. పలితంగా తక్కువ సమయంలో గమ్యం చేరుతుంది. సెక్యురిటీ కోసం సైడ్ వాల్స్, పైకప్పు, కేబిన్ అన్నీ ఆస్టోనిటిక్ స్టీల్‌తో నిర్మితమయ్యాయి. 

2 /8

వందేభారత్ స్లీపర్ రైలు ఉద్దేశ్యం ఆహ్లాదకరమైన రైలు ప్రయాణం అందించడం. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు కంటే ఏ విధంగా వందేభారత్ రైలు మెరుగైందో తెలుసుకుందాం.

3 /8

వందేబారత్ స్లీపర్ రైలు పూర్తిగా సీల్డ్ ఉంటుంది. ఫలితంగా ఎయిర్ కండీషనింగ్ మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ రైలులో కుదుపులుండవు

4 /8

రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే వందేభారత్ స్లీపర్ రైలు ఆటోమేటెడ్ ట్రైన్. ఈ రైలు నడిపేందుకు లోకోమోటివ్ అవసరం లేదు. ఈ రైలులో రెండువైపులా డ్రైవర్ కేబిన్ ఉంటుంది. 

5 /8

ఇండియన్ రైల్వేస్ ప్రకారం ఈ రైలులో పడుకునేందుకు బెర్త్ మరింత కుషన్ కలిగి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇది కాకుండా మిడిల్ బర్త్‌కు వెళ్లేందుకు మెట్లుంటాయి.

6 /8

వందేభారత్ స్లీపర్ రైలులో తలుపులు డ్రైవర్ కంట్రోల్‌లో ఉంటాయి. ఇవి ఆటోమేటిక్‌గా పనిచేస్తాయి. రెండు కోచ్‌ల మధ్య స్వయంగా పనిచేసే ఇంటర్ కనెక్టింగ్ తలుపులుంటాయి.

7 /8

వందేభారత్ స్లీపర్ రైలు చాలా ఆహ్లాదంగా ఎలాంటి కుదుపుల్లేకుండా ఉంటుంది. ఇందులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. ఇందులో ఫస్ట్ క్లాస్ 1, టూ టైర్ ఏసీ 4,3 టైర్ ఏసీ 3 ఉంటాయి. ఒకేసారి మొత్తం 823 మంది ప్రయాణీకులు ప్రయాణం చేయవచ్చు.

8 /8

ఈ రైలులో టచ్ ప్రీ ఫిటింగ్స్‌తో పాటు బయో వాక్యూమ్ టాయ్‌లెట్స్ ఉంటాయి. ఏసీ ఫస్ట్ క్లాస్‌లో అయితే షవర్ క్యూబికల్ ఉంటుంది. అంతేకాకుండా క్రాష్ బఫర్, డిఫార్మేషన్ ట్యూబ్ సిస్ట్ ఉంటుంది.