Varun Tej - Lavanya Tripathi: ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు..

Varun Tej - Lavanya Tripathi: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గతేడాది ఇరు కుటుంబాలకు చెందిన పెద్దల సమక్షంలో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత హానీమూన్ చేసుకున్న తాము అంతకు ముందు ఒప్పుకున్న సినిమాల కారణంగా సరిగా ఎంజాయ్ చేయలేకపోయారు. తాజాగా మరోసారి ఈ జంట ప్రకృతి అందాల మధ్య తమ సమయాన్ని గడుపుతున్నారు. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

1 /6

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ మెంబర్స్‌ను ఒప్పించి ఏడడుగుల బంధంతో ఒకటయ్యారు.

2 /6

వీళ్లిద్దరి వివాహాం ఇటలీలో నవంబర్ 1న జరిగింది. పెళ్లి తర్వాత ఇటలీలో హనీమూన్ వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు.

3 /6

మరోవైపు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి అప్పటికే కమిటైన ప్రాజెక్ట్స్ పూర్తి చేయాల్సిన పరిస్థితి రావడంతో ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు.

4 /6

రీసెంట్‌గా వరుణ్ తేజ్.. 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా పూర్తి చేసాడు. ఈ సినిమాకు టాక్ బాగొచ్చినా.. కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు.

5 /6

అటు లావణ్య త్రిపాఠి కూడా తన చేతిలో ఉన్న వెబ్ సిరీస్‌, సినిమాలు పూర్తి చేసి ఫ్రీ అయింది. దీంతో వీళ్లిద్దరు మరోసారి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

6 /6

వరుణ్‌ తేజ్, లావణ్య త్రిపాఠిలు తొలిసారి 'మిస్టర్' సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత 'అంతరిక్షం'లో కలిసి నటించారు. రెండు డిజాస్టర్ మూవీస్ వీరి ప్రేమను బ్లాక్ బస్టర్ చేసాయని చెప్పాలి.