Vijay Thalapathy Home: ప్రముఖ తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఫ్యాన్ బేస్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఆయనకు తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. బీస్ట్, మాస్టర్ వంటి చిత్రాలతో తెలుగులో ఆయనకు మంచి ప్రజాదరణ లభించింది. విజయ్ సినిమాకు తమిళంలో కాకుండా టాలీవుడ్ లో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి క్రేజ్ లభిస్తోంది. అయితే విజయ్ ఎక్కువగా లగ్జరీగా ఉండేందుకు ఇష్టపడతారట.
విజయ్ దళపతి లగ్జరీగా ఉండడం కోసం ఖరీదైన కార్లలో ప్రయాణించడమే కాకుండా ఇంద్రభవనాల లాంటి ఇళ్లలో జీవనం సాగిస్తారని ఓ టాక్ ఉంది. అయితే ఇటీవలే ఆయన ఇంటికి సంబంధించిన ఓ హోమ్ టూర్ వీడియో తెగ వైరల్ అవుతోంది.
తమిళనాడులోని చెన్నైలో విజయ్ జన్మించారు. ప్రస్తుతం ఆయన పుట్టి పెరిగిన ఇల్లుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికీ ఆ ఇంట్లో ఆయన పేరెంట్స్ ఉంటున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా విజయ్ గెల్చుకున్న అవార్డ్స్ ఇదే ఇంట్లో భద్రపరిచినట్లు తెలుస్తోంది. ఆయనకు చెన్నైలో ఉన్న ఈ ఇల్లు అంటే ఎంతో ఇష్టమట. అందుకే ఆయన గెలుచుకున్న ప్రతి ఒక్క అవార్డు ఇక్కడే ఉంచుతారని సమాచారం.
చెన్నైలో ఉన్న ఈ ఇల్లు చాలా పాతదైనప్పటికీ అద్భుతమైన ఇంటీరియల్ డిజైనింగ్ తో ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన గదులు కూడా ఉన్నాయి.
అంతేకాకుండా విజయ్ పుట్టిన ఇంట్లో ఆయన ప్రత్యేకమైన ఆఫీసును కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆఫీసు మొదటి ఫ్లోర్ లోనే ప్రత్యేకమైన సోఫాలతో ఉంటుంది.
అంతేకాకుండా విజయ్ దళపతి కి చెన్నైలో రెండవ ఇల్లు కూడా ఉంది. నీలం కరేయ్ బీచ్ రోడ్లో ఆయన ఇటీవలే రెండో ఇంటిని కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం.
అంతేకాకుండా ఆయన ఇటీవలే కొనుగోలు చేసిన ఇల్లు దాదాపు 75 కోట్లకు పైగానే ఉంటుందట. ఇందులో ప్రత్యేకమైన జీవితం పాటు చిన్న పార్క్ కూడా ఉంటుంది.
నీలం కరేయ్ బీచ్ రోడ్లో విజయ్ కొనుగోలు చేసిన ఈ ఇంట్లో ప్రత్యేకమైన జిమ్ కూడా ఉంటుందట. అంతేకాకుండా ఎన్నో రకాల లగ్జరీ వస్తువులు ఉన్నాయని సమాచారం.