Ind Vs WI Records: కరేబియన్ జట్టుతో టీమిండియా వన్డే సిరీస్‌.. ప్లేయర్లను ఊరిస్తున్న రికార్డులు

India vs West Indies Odi Series: వెస్టిండీస్‌పై 1-0 తేడాతో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌పై కన్నేసింది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో మూడు వన్డేల సిరీస్‌లో గురువారం మొదటి వన్డే ఆడనుంది. ఈ సిరీస్‌లో ఆటగాళ్లను కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.
 

1 /5

స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో 13 వేల పరుగులు పూర్తి చేసేందుకు ఇంకా 102 పరుగులు చేయాల్సి ఉంది. కోహ్లీ ప్రస్తుతం 46 సెంచరీలతో 12,898 పరుగులతో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ ఈ ఘనత సాధిస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 13 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు.   

2 /5

వన్డే క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు 175 పరుగులు అవసరం. విరాట్ కోహ్లీ తర్వాత ఈ మైలురాయిని అందుకున్న రెండో ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా రోహిత్ నిలుస్తాడు.   

3 /5

అంతర్జాతీయ క్రికెట్‌లో 2,500 పరుగులు పూర్తి చేసేందుకు టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 21 పరుగులు చేయాలి.    

4 /5

వన్డేల్లో 200 వికెట్ల మార్కును చేరుకున్న ఏడో భారత బౌలర్‌గా అవతరించేందుకు టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు తొమ్మిది వికెట్లు అవసరం. కపిల్ దేవ్ (3783 పరుగులు, 253 వికెట్లు) తర్వాత వన్డేల్లో 2 వేల పరుగులు, 200 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలుస్తాడు.   

5 /5

వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ షిమ్రాన్ హిట్‌మేయర్ (1,497) వన్డేల్లో 1,500 పరుగులు పూర్తి చేయడానికి 3 పరుగులు కావాలి. దాదాపు రెండేళ్ల తరువాత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన హిట్‌మేయర్‌పై విండీస్ టీమ్ భారీ అంచనాలు పెట్టుకుంది.