Kannappa Movie: గుజరాత్ సీఎంను కలిసిన కన్నప్ప టీమ్.. ముఖ్యమంత్రి అతిథి మర్యాదలకు ఫిదా

Kannappa Movie Team Meets Gujarat CM Bhupendra Patel: మంచు విష్ణు హీరోగా పాన్‌ఇండియా వైడ్‌గా భారీ ఎత్తున రూపొందుతున్న చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్‌ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ఏప్రిల్ 25న ఆడియన్స్ ముందుకు రానుంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌లో మంచు విష్ణు బిజీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రమోషనల్ టూర్స్‌ను నిర్వహిస్తున్నారు.
 

1 /5

తండ్రి మోహన్ బాబుతో కలిసి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ను కలిశారు మంచు విష్ణు. వారితో పాటు శరత్ కుమార్, ముఖేష్ రిషి, వినయ్ మహేశ్వరి ఉన్నారు.  

2 /5

ప్రముఖ తెలుగు కళాకారుడు రమేష్ గొరిజాల గీసిన బ్యూటీఫుల్ పెయింటింగ్‌ను విష్ణు మంచు ముఖ్యమంత్రికి అందజేశారు.  

3 /5

సీఎం భూపేంద్ర పటేల్ అతిథి మర్యాదలకు కన్నప్ప టీమ్‌ కృతజ్ఞతలు తెలిపింది. కన్నప్ప మూవీ విశేషాలను ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలుస్తోంది.  

4 /5

ఇక ఈ మూవీలో అన్ని ఇండస్ట్రీల నుంచి సూపర్ స్టార్స్‌ గెస్ట్ రోల్స్‌ చేయడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.  

5 /5

ముఖ్యంగా ప్రభాస్‌ లుక్‌పై ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 3వ తేదీన కన్నప్ప మూవీ నుంచి ప్రభాస్ లుక్‌ను అధికారికంగా రిలీజ్ చేయనున్నారు.    

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x