Diet Tips: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే..శరీరంలో అన్ని రకాల న్యూట్రియంట్లు అవసరం. పోషకాల లోపముంటే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడతాయి. కొంతమందికి అలసట, బలహీనత పెను సమస్యగా ఉంటుంది. ఎముకల్లో నొప్పి ఉంటుంది. తినే ఆహారంలో విటమిన్ల లోపం రావచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే..పోషకాల లోపం దూరం చేయాలి. విటమిన్ల లోపముంటే..ఎముకల్లో నొప్పు సమస్య బాధిస్తుంది.
వెజిటేరియన్‌లో విటమిన్ డి పాలు, పెరుగు, పన్నీర్, మష్రూమ్ వంటి పదార్ధాల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి లోపం పూర్తి చేసేందుకు ఈ పదార్ధాలు డైట్‌లో చేర్చుకోవాలి. ఆరెంజ్, ఆరటి పండ్లు, బొప్పాయి కూడా కీలకంగా ఉపయోగపడతాయి.
సూర్యరశ్మిలో విటమిన్ డి సూర్యరశ్మి విటమిన్ డికు ప్రధాన మూలం. రోజూ 10-15 నిమిషాలు నీరెండలో కూర్చుంటే విటమిన్ డి లోపం ఉండదు. ఫలితంగా ఎముకలు బలంగా ఉంటాయి. జాయింట్ పెయిన్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
నాన్ వెజ్‌లో విటమిన్ డి చేపలు, గుడ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. సాల్మన్ ఫిష్, ట్యూనా ఫిష్‌లో పెద్దమొత్తంలో విటమిన్ డి ఉంటుంది. నాన్ వెజ్ ఆహారంలో విటమిన్ డి చాలా ఎక్కువ.
విటమిన్ డి లోపంతో వ్యాధి విటమిన్ డి లోపం ఎక్కువైతే ఆస్టియోపోరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధికి దారితీస్తుంది. ఫలితంగా వీపులో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఎక్కువగా ఇది మహిళలు, వృద్ధుల్లో ఉంటుంది.
విటమిన్ డి లోపం శరీరంలో విటమిన్ డి లోపముంటే అలసట, బలహీనత ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. ఎముకల పటిష్టంగా ఉండాలంటే విటమిన్ డి అవసరం. ఒకవేళ శరీరంలో విటమిన్ డి లోపముంటే ఎముకలు బలహీనమౌతాయి. కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ సమస్యలుంటాయి.