Weight Loss Diet: కేవలం వారం రోజుల్లో 2-3 కిలోల బరువు తగ్గే అద్బుతమైన 7 డేస్ డైట్ ప్లాన్

7 Days Diet Plan: ఇటీవలి కాలంలో అధిక బరువు ప్రదాన సమస్యగా మారిపోయింది. చెడు ఆహారపు అలవాట్లు గంటల తరబడి కూర్చుని చేసే ఉద్యోగాలు, జీవనశైలి అధిక బరువుకు కారణమౌతున్నాయి. నిరంతరం బరువు పెరుగుతుండటంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి.

7 Days Diet Plan: ఈ క్రమంలో బరువు తగ్గించేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నించి విఫలం అవుతుంటారు. మీరు కూడా అధిక బరువుతో బాధపడుతుంటే మీ కోసం ఈ డైట్ ప్లాన్ సిద్ధంగా ఉంది. ఈ డైట్ ప్లాన్ ఫాలో అయితే వారంలో 2-3 కిలోల బరువు చాలా సులభంగా తగ్గించవచ్చు. ఇది వారం రోజుల డైట్ ప్లాన్.

1 /9

మొదటి రోజు డైట్ ప్లాన్ మొదటి రోజు బ్రేక్ ఫాస్ట్ రూపంలో 2 బాయిల్డ్ ఎగ్స్, సగం గిన్నెలో ఓట్స్ తినాలి. మద్యాహ్నం భోజనంలో 1 గిన్నె సోయా చంక్ పులావ్ తీసుకోవాలి. కీరా కలిపిన రాయితా సలాడ్ తీసుకోవాలి. డిన్నర్ కింద 2 టోస్ట్ 1 బౌల్ టొమాటో సూప్ తాగాలి.

2 /9

రెండవ రోజు డైట్ ప్లాన్ రెండవ రోజు బ్రేక్ ఫాస్ట్ లో రెండు జొన్న దోసెలు, సగం గిన్నె పెరుగు తీసుకోవాలి. మద్యాహ్నం ఒక గిన్నె అన్నం, ఒ గిన్నె కూరగాయల కర్రీ, ఒ రోటీ సలాడ్ తీసుకోవాలి. రాత్రి 2 బ్రెడ్ పన్నీర్ భుర్జీ తీసుకోవాలి

3 /9

మూడో రోజు డైట్ ప్లాన్ మూడో రోజు డైట్ ప్లాన్ లో బనానా పన్నీర్ బటర్ స్మూదీ తీసుకోవాలి. మద్యాహ్నం లంచ్ కింద ఒ గిన్నె నెయ్యితో చేసిన కూర, ఒ గిన్నె పెరుగు, ఒక బాయిల్డ్ ఎగ్, 1 రోటీ, సలాడ్ తినాలి. రాత్రి డిన్నర్ 1 గిన్నె కూరగాయల కర్రీ, క్వినోవా పుడ్ తీసుకోవాలి.

4 /9

నాలుగో రోజు డైట్ ప్లాన్ నాలుగో రోజు బ్రేక్ ఫాస్ట్ లో 2 గుడ్ల ఆమ్లెట్, 2 టోస్ట్ తీసుకోవాలి. మద్యాహ్నం 2 ప్లెయిన్ దోశ, 1 గిన్నె సాంబారు తీసుకోవాలి. ఇక రాత్రి అయితే 1 గిన్నె ఫ్రై కూరగాయలు పన్నీరు తీసుకోవాలి

5 /9

ఐదవ రోజు డైట్ ప్లాన్ ఐదవ రోజు బ్రేక్ ఫాస్ట్ లో పుదీనా చట్నితో 2 శెనగ పిండి దోసెలు తినాలి. మద్యాహ్నం లంచ్ లో 1 గిన్నె రాజ్మా, 1 గిన్నె అన్నం, సలాడ్ తినాలి. రాత్రి డిన్నర్ లో 1 గిన్నె స్ప్రౌట్స్, కీరా టొమాటో, ఆనియన్ సలాడ్ తినాలి

6 /9

ఆరవ రోజు డైట్ ప్లాన్ ఆరో రోజు బ్రేక్ ఫాస్ట్ లో 1 గిన్నె మిక్స్డ్ వెజిటబుల్స్ పోహా తినాలి. లంచ్ లో 1 గిన్నె పప్పు, 1 గిన్నె కూర, 1 రోటీ సలాడ్ తినాలి. రాత్రి భోజనంలో 1 గిన్నె కూర తీసుకోవాలి.

7 /9

ఏడవ రోజు డైట్ ప్లాన్ ఏడవ రోజు డిన్నర్ లో కొబ్బరి పచ్చడితో కలిపి 3 ఇడ్లీ తినాలి. లంచ్ లో మటర్ పన్నీరు, 1 గిన్నె కీరా రాయితా, 1 రోటీ తినాలి. రాత్రి డిన్నర్ కింద 1 గిన్నె ఉప్మా,  గిన్నె పెరుగు తీసుకోవాలి

8 /9

డైట్ ఛార్ట్ ఫాలో అవుతూనే రోజూ 2 సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా తినాలి. స్నాక్స్ కింద రోస్టెడ్ మఖ్నా, రోస్డెడ్ శెనగలు, పాప్ కార్న్, బేక్డ్ చిప్స్ తీసుకోవాలి. ఇలా చేస్తే వారంలో 2-3 కిలోల బరువు కచ్చితంగా తగ్గుతారు.

9 /9